iDreamPost

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు పెంచిన EPFO..

  • Published Feb 10, 2024 | 3:39 PMUpdated Feb 10, 2024 | 3:39 PM

పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేటు పెంచుతూ ఈపీఎఫ్‌ఓ నిర్ణయం తీసుకుంది. ఎంత పెంచింది అంటే..

పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేటు పెంచుతూ ఈపీఎఫ్‌ఓ నిర్ణయం తీసుకుంది. ఎంత పెంచింది అంటే..

  • Published Feb 10, 2024 | 3:39 PMUpdated Feb 10, 2024 | 3:39 PM
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు పెంచిన EPFO..

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌.. పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వడ్డీరేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీ రేటును ఖరారు చేసింది. శనివారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సమావేశం సందర్భంగా పీఎఫ్‌ వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ ఏడాది ఈపీఎఫ్ ఖాతాల్లోని నిల్వలపై వడ్డీ రేటు 8.25 శాతంగా ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. పీఎఫ్‌ మొత్తంపై గత మూడేళ్లలో ఇదే అత్యధిక వడ్డీ రేటు కావడం గమనార్హం. ఇక గతేడాది వడ్డీ రేటుతో పోలీస్తే.. ఈ ఏడాది ఇంట్రెస్ట్‌ రేటు స్వల్పంగా పెంచారు. దీనిపై పీఎఫ్‌ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఈ రోజు జరిగిన ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ 235వ సమావేశం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. దేశ శ్రామిక శక్తికి సామాజిక భద్రతను పటిష్టం చేయాలన్న ప్రధాని నరేంద​ మోదీ హామీని నెరవేర్చే క్రమంలో నేడు తీసుకున్న నిర్ణయం ఓ మందడుగు’’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలు ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తర్వాత ప్రతి ఏడాది ఈపీఎఫ్‌ వడ్డీ రేటును సమీక్షిస్తారు. ఆ తర్వాత సీబీటీ సిఫార్సు చేసిన రేటును పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది వడ్డీ రేటు తెలియజేస్తుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించన తర్వాత మాత్రమే పెంచిన వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటీఫై చేస్తుంది. ఆ తర్వాత ఈ వడ్డీ మోత్తాన్ని ఈపీఎఫ్ఓకు చెందిన సుమారు 6 కోట్ల మంది చందాదారుల అకౌంట్లలో జమ చేస్తుంది.

ఇక సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన వడ్డీ రేటుతో పోలిస్తే ఈ ఏడాది కాస్త పెరిగింది. 2022- 23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ రేటును 8.15 శాతంగా ఇచ్చారు. అంతకు ముందు ఏడాది 2021- 22లో 8.10 శాతంగా ఇచ్చారు. వీటితో పోలిస్తే ఈసారి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచి 8.25గా నిర్ణయించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి