iDreamPost
android-app
ios-app

యువ క్రికెటర్ కు అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే కెరీర్ కు గుడ్ బై!

  • Published May 02, 2024 | 9:27 AM Updated Updated May 02, 2024 | 9:27 AM

అరుదైన గుండె జబ్బు కారణంగా ఓ 23 ఏళ్ల యంగ్ క్రికెటర్ తన క్రికెట్ కెరీర్ కు అర్థాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అరుదైన గుండె జబ్బు కారణంగా ఓ 23 ఏళ్ల యంగ్ క్రికెటర్ తన క్రికెట్ కెరీర్ కు అర్థాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

యువ క్రికెటర్ కు అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే కెరీర్ కు గుడ్ బై!

దేశం తరఫున జాతీయ జట్టుకు ఆడాలన్నది ఆ యువ క్రికెటర్ కల. అందుకోసం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డాడు. అతడి కష్టానికి ఫలితంగా డొమెస్టిక్, క్లబ్ క్రికెట్ లో అవకాశాలు లభించాయి. కానీ అనూహ్యంగా అరుదైన గుండె జబ్బు అతడి కలను ఛిద్రం చేసింది. దేశం తరఫున ఆడాలన్న అతడిని డ్రీమ్ ను తొలచివేసింది. దాంతో చేసేది ఏమీ లేక 23 ఏళ్లకు అర్దాంతరంగా తన కెరీర్ కు వీడ్కోలు పలికాడు ఓ యువ ఆటగాడు. ఈ విషాద వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

గ్లౌషెష్టర్ షైర్ టీమ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ బెన్ వెల్స్ అర్ధాంతరంగా తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్ కు చెందిన వెల్స్ అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యూలర్ కార్డియోమయోపతి అనే అరుదైన గుండె జబ్బుకు గురైయ్యాడు. ఈ వ్యాధికి గురైన వారు ఎక్కువగా ఎక్సర్ సైజ్ లు చేయకూడాదు. ఓ ఆటగాడిగా ఇది వ్యాయామం చేయడం కచ్చితం. దాంతో తన కెరీర్ కు అర్దాంతరంగా వీడ్కోలు పలికాడు బెన్. ఇటీవలే టెస్టులు చేయించుకోవడంతో ఈ వ్యాధి బయటపడింది.

“ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, ఇలాంటి బాధాకరమైన ప్రకటన చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. కానీ ముందుగానే ఈ వ్యాధి బయటపడినందుకు నేను సంతోషిస్తున్నాను. అందుకు డాక్టర్లకు ధన్యవాదాలు. కొన్నేళ్లు నేను ప్రొఫెషన్ క్రికెటర్ అని చెప్పుకునేందుకు ఎంతో గర్వపడుతున్నాను. అయితే క్రికెట్ నన్ను తీసుకెళ్లే మార్గం ఇదేనని నేనెప్పుడు అనుకోలేదు. ఇక మా తమ్ముడితో కలిసి క్రికెట్ ఆడటం, గౌషెష్టర్ షైర్ తరఫున ఆడటం గర్వంగా ఉంది. ఇవన్నీ నా కెరీర్ లో ఆస్వాదించినందుకు సంతోషంగా ఉన్నాను. కానీ బాధతో కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నాను” అంటూ ఓ ప్రకటనలో రాసుకొచ్చాడు. కాగా.. 23 ఏళ్ల బెన్ వెల్స్ 2021లో క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. డొమెస్టిక్ కెరీర్ లో ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 15 లిస్ట్-ఏ మ్యాచ్ లు, 19 టీ20లు ఆడాడు. చివరిగా ఆడిన మ్యాచ్ లో అతడు తన తొలి సెంచరీని సాధించడం విశేషం. మరి ఈ విషాదకర విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.