iDreamPost
android-app
ios-app

IND vs ENG: బుమ్రాపై దాడికి సిద్ధం.. మూడో టెస్ట్ కు ముందు స్టోక్స్ కీలక వ్యాఖ్యలు!

  • Published Feb 14, 2024 | 9:39 PM Updated Updated Feb 14, 2024 | 9:39 PM

మూడో టెస్ట్ కు ముందు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై మాటలతో కవ్వింపులకు దిగాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. అతడిపై దాడికి సిద్దంగా ఉన్నామని పేర్కొన్నాడు.

మూడో టెస్ట్ కు ముందు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై మాటలతో కవ్వింపులకు దిగాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. అతడిపై దాడికి సిద్దంగా ఉన్నామని పేర్కొన్నాడు.

IND vs ENG: బుమ్రాపై దాడికి సిద్ధం.. మూడో టెస్ట్ కు ముందు స్టోక్స్ కీలక వ్యాఖ్యలు!

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 15 (గురువారం)న కీలకమైన మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో రాజ్ కోట్ వేదికగా జరగబోయే మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ముందంజ వేయాలని ఇటు టీమిండియా.. అటు ఇంగ్లాండ్ జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్. అతడిపై దాడికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు స్టోక్స్.

మూడో టెస్ట్ కోసం ఇండియా-ఇంగ్లాండ్ సిద్దమైయ్యాయి. ఎవరి ప్రణాళికలతో వారు బరిలోకి దిగనున్నారు. తొలుత ఇరు జట్లు నలుగురు స్పిన్నర్లతో మ్యాచ్ లోకి దిగాలని భావించారు. దానికి కారణం పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని. ఇదే స్ట్రాటజీతో ముందుకుసాగాలనుకుంటున్నాయి జట్లు. ఇదిలా ఉండగా.. మూడో టెస్ట్ కోసం ఏవైనా ప్లాన్స్ వేశారా? ప్రత్యేకంగా బుమ్రా కోసం ఏదైనా వ్యూహం పన్నారా? అని మీడియా అడిగినప్పుడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.

“బుమ్రా గొప్ప బౌలర్. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు ఎప్పటికప్పుడు తన బౌలింగ్ విన్యాసాలను ప్రపంచానికి చూపిస్తూనే ఉన్నాడు. అయితే రాబోయే టెస్టుల్లో బుమ్రాను ఎదుర్కొవడానికి, అతడిపై దాడి చేయడానికి మేం సిద్దంగా ఉన్నాం. అతడి బౌలింగ్ లో డిఫెన్స్ కు బదులు పరుగులు చేయడానికి కొన్ని వ్యూహాలు అనుసరించాల్సి ఉంది. వాటిని అమలు పరిచేందుకు మేం సిద్దం. ఇలా చేస్తే.. బౌలర్ తో పాటుగా జట్టు కూడా ఒత్తిడికి లోనౌతుంది” అంటూ చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్. చూడాలి మరి రాజ్ కోట్ పిచ్ పై రాజు ఎవరౌతారో? బుమ్రాపై బెన్ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024 సీజన్ కు సంబంధించి బిగ్ అప్డేట్.. ఆ వార్తలన్నింటికీ చెక్!