iDreamPost

మానవత్వం మరచి.. కన్న కూతురు శవాన్ని బేరానికి పెట్టాడు!

  • Published Mar 28, 2024 | 5:45 PMUpdated Mar 28, 2024 | 5:45 PM

ప్రస్తుత కాలంలో మనిషి కన్నా అందరూ డబ్బుకే ఎక్కువ విలువనిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో బయట వ్యక్తుల కంటే కుటుంబ సభ్యులే అత్యంత దారుణంగా దిగజారిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చోటు చేసుకున్న ఘటనలో కూడా ఓ తండ్రి తన కుమార్తె పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు. కనీసం కూతురు కళ్ల ముందు ఆ స్థితిలో ఉన్న జాలీ లేకుండా డబ్బు కోసం ఆశ పడ్డాడు.

ప్రస్తుత కాలంలో మనిషి కన్నా అందరూ డబ్బుకే ఎక్కువ విలువనిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో బయట వ్యక్తుల కంటే కుటుంబ సభ్యులే అత్యంత దారుణంగా దిగజారిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చోటు చేసుకున్న ఘటనలో కూడా ఓ తండ్రి తన కుమార్తె పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు. కనీసం కూతురు కళ్ల ముందు ఆ స్థితిలో ఉన్న జాలీ లేకుండా డబ్బు కోసం ఆశ పడ్డాడు.

  • Published Mar 28, 2024 | 5:45 PMUpdated Mar 28, 2024 | 5:45 PM
మానవత్వం మరచి..  కన్న కూతురు శవాన్ని బేరానికి పెట్టాడు!

ప్రస్తుత కాలంలో మనిషి కన్నా అందరూ డబ్బుకే ఎక్కువ విలువనిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో బయట వ్యక్తుల కంటే కుటుంబ సభ్యులే అత్యంత దారుణంగా దిగజారిపోతున్నారు. ఎందుకంటే.. బయట వ్యక్తులు కేవలం అయితే మోసమే చేస్తారు. కానీ, కుటంబ సభ్యులయితే నిలువునా ప్రాణాలే తీసేస్తున్నారు. ఈ పాపిష్టి డబ్బు కోసం చాలామంది రక్త సంబంధన్ని కూడా మార్చిపోయి మరీ నీచాంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ డబ్బు కోసం కడుపున పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు పట్ల కర్కసంగా ప్రవర్తించే సంఘటనలు మనం చూస్తేనే ఉన్నాం. కానీ, ఆ డబ్బు కోసం రక్తం పంచుకు పుట్టిన పిల్లల పట్ల ఎవరూ నీచంగా, కర్కంశంగా ప్రవర్తించారు. అయితే తాజాగా చోటు చేసుకున్న ఓ ఘోర సంఘటనలో కూడా ఓ తండ్రి తన కుమార్తె పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు. కనీసం కూతురు కళ్ల ముందు ఆ స్థితిలో ఉన్న జాలీ లేకుండా డబ్బు కోసం ఆశ పడ్డాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే రాజస్థాన్ అల్వార్ జిల్లాలో ఓ దారుణం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా అందరూ హోలీ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ ప్రమాదవశాత్తు ఓ గర్భిణి మహిళ జారిపడి మృతి చెందింది. ఈ ఘటన రాజ్ గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే.. ఈ మృతదేహనికి డబ్బులు ఇవ్వాలని.. లేదంటే మృతదేహం ఇచ్చిందే లేదంటూ కన్నతండ్రే..  మృతురాలి భర్త కు తేల్చి చెప్పాడు. అసలు ఓ పక్క కన్న కూతురు చనిపోయిందన్న బాధేమీ లేకుండా.. ఆస్పత్రి ఖర్చుకు అయిన డబ్బులు ఇవ్వాలని  అల్లుడి పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. పోలీసు తెలిపిన కథనం ప్రకారం.. రాజ్ గఢ్ ప్రాంతంలొని పటాన్ కు చెందిన బస్ మచాడీలో నవాసం ఉంటున్న నెలన్నర గర్భిణి రాజంతి దేవి సోమవారం హోలీ పండుగ ఆడుకుంటుండగా.. జారీ పడిపోయింది. దీంతో వెంటనే ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. ఇక ఆస్పత్రిలో మృతురాలి కుటుంబీకులు, అత్తమామలు గొడవపడ్డారు. ఇలా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

అసలు గొడవకు కారణమేమిటో మృతిరాలి భర్త అజయ్ పోలీసులకు తెలియజేశాడు. తన భర్య రాజంతి బాయి మరణించగా..ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లకుండా.. తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారని, అలాగే తనను , తన కుటుంబాన్ని కూడా కొట్టారని అతడు పోలీసులకు చెప్పాడు. అంతేకాకుండా తన భర్య చికిత్స నిమిత్తం ఆమె తండ్రి సుమారు రూ. 50 వేలు ఖర్చు చేశారని.. అయితే ఆ డబ్బులు వారికి ఇస్తేనే మృతదేహానని తీసుకెళ్లాలని వాగ్వాదానికి దిగారు. అయితే ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో మహిళ మృతదేహాన్ని తన భర్తకు అప్పగించారు. కాగా, అజయ్, రాజంతి బాయిల వివాహం 2021లో జరిగింది.  అలాగే వీరికి ఏడాది కూతురు కూడా ఉండడం గమన్హారం. మరి, కూతురి మృతదేహాన్ని  ఆ తండ్రి డబ్బులు అమ్ముకునే ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి