iDreamPost

వాట్సాప్- ఇన్ స్టాకి పోటీగా ‘X’లో ఆడియో- వీడియో కాల్స్!

వాట్సాప్- ఇన్ స్టాకి పోటీగా ‘X’లో ఆడియో- వీడియో కాల్స్!

ట్విట్టర్.. ఈపేరు అందరికీ బాగా అలవాటు అయిపోయింది. ఎలన్ మస్క్.. X అని పేరు మార్చినా కూడా ఇప్పటికీ ట్విట్టర్ అనే పిలుస్తున్నారు. ఈ సంస్థను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి ఎలన్ మస్క్ కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఎలాన్ మస్క్ ఏం చేసినా సర్థించేవారు ఉన్నారు.. వ్యతిరేకించే వారూ ఉన్నారు. టెక్నాలజీ పరంగా మాత్రం మస్క్ రెండడుగులు ముందే ఉంటారు. అది అంతరిక్షం కావచ్చు, ఆటోపైలెట్ కార్లు కావచ్చు. ఇప్పుడు ఆ దూకుడిని Xకి కూడా ఆపాదిస్తున్నారు. కొత్తగా ఆడియ- వీడియో కాల్స్ రాబోతున్నట్లు వెల్లడించారు.

సాధారణంగా మామూలు ఫోన్లు మాట్లాడటం ఎప్పుడో ఔట్ డేటెడ్ అయిపోయింది. ఇప్పుడు అంతా వీడియో కాల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ఫీచర్ వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి పలు సోషల్ మీడియా యాప్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, Xలో మాత్రం ఆ ఫీచర్ అందుబాటులో లేదు. ఇది కేవలం ఒక బ్లాగింగ్ సైట్ లా మాత్రమే ఉండేది. మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత Xని అన్ని యాప్స్ కంటే భిన్నంగా, టాప్ ప్లేస్ లో నిలబెడతానంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ మాటలను చేతల్లో పెట్టి చూపించే సమయం వచ్చిందంటున్నారు. Xకి సంబంధించి ఎలాన్ మస్క్ కీలక ట్వీట్ చేశారు.

అతి త్వరలోనే ఆడియో- వీడియో కాలింగ్ ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాం అంటూ ప్రకటించారు. “ఆడియో- వీడియో కాల్స్ Xలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ఫీచర్స్ ఐవోఎస్, ఆండ్రాయిడ్, మ్యాక్- పర్సనల్ కంప్యూటర్ లో వాడుకోవచ్చు. ఆడియో- వీడియో కాల్స్ కి ఎలాంటి మొబైల్ నంబర్ కూడా అవసరం లేదు. X అనేది గ్లోబల్ అడ్రస్ బుక్” అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే అదే జరిగితే ఇంక వాట్సాప్- ఇన్ స్టాగ్రామ్ కు ఎదురుదెబ్బ తప్పదంటూ కామెంట్ చేస్తున్నారు. ఆడియో- వీడియో కాల్స్ ఫీచర్ Xకు ఎంతో మేలు చేసే అంశంగా చెబుతున్నారు.

సోషల్ మీడియాకి సంబంధించి అన్నీ ఫీచర్స్ దొరికే ఒకే ప్లాట్ ఫామ్ గా X అవతరిస్తోందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా మార్క్ జుకర్ బర్గ్ కు మింగుడు పడదనే చెప్పాలి. Xని టార్గెట్ చేస్తూ థ్రెడ్స్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎలాన్ మస్క్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే చెప్పాలి. నిజానికి ఎలాన్ మస్క్ Xని పట్టించుకోవడం లేదంటూ చాలా మంది యూజర్లు ఈ ప్లాట్ ఫామ్ కి దూరమయ్యారు. ఇలాంటి ఫీచర్స్ తీసుకువస్తే మళ్లీ ట్విట్టర్ మళ్లీ గాడిలో పడుతుందనే చెప్పచ్చు. మస్క్ చేసిన ప్రకటనపై టెక్ నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి