iDreamPost

ఎంపీ, ప్రముఖ నటికి ఈడీ నోటీసులు

ఎంపీ, ప్రముఖ నటికి ఈడీ నోటీసులు

ప్రముఖ బెంగాల్ నటి, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కి సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. మోడల్ గా కెరీర్ ఆరంభించిన నుస్రత్ 2011లో ‘షోత్రు’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. దాదాపు ఇరవై చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే 2019లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పలు అక్రమాలకు పాల్పపడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా నుస్రత్ కి ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

కేవలం రూ.6 లక్షలకే ఫ్లాట్లు విక్రయిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన కేసులో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుస్రత్ జహాన్ నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత శంకుదేబ్ పాండా ఫిర్యాదు మేరకు ఈడీ డైరెక్టరేట్ నుస్రత్ పై కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 12న కోల్‌కొతా‌లోని ఈడీ కార్యాలయం ముందు హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం బసిర్‌హత్ నియోజకవర్గం ఎంపీగా ఉన్న నుస్రత్ జహాన్ ఫ్లాట్‌ విక్రయాల కుంభకోణంలో ద్వారా దాదాపు రూ.24 కోట్ల మేరకు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ ఆరోపణలు ఆమె ఖండిస్తూ వచ్చారు.

బీజేపీ నేత శంకుదేబ్ పాండా ఫిర్యాదులో ప్రకారం.. కోల్‌కతా శివారు ప్రాంతంలో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం రూ.6 లక్షలకు  త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ నిర్మించి ఇస్తామని 429 మంది నుండి డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు తమకు ఫ్లాట్ కట్టి ఇవ్వలేదని.. కనీసం డబ్బు కూడా తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పపడుతున్నారని పాండా తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన నుస్రత్ సెవెన్ సెన్స్ ఇంటర్నేషనల్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి 2017 లో రాజీనామా చేసినట్లు తెలిపింది. కాగా, నుస్రత్ తో పాటు కంపెనీ డైరెక్టర్ రాకేష్ సింగ్, ఉన్నతాధికారి రూపేఖా మిత్రా కు కూడా సమన్లు పంపారు. ఎంపీ నుస్రత్ జహాన్ తో పాటు మరికొందరిపై ఈ విషయంపైనే కోల్‌కొతాలోని అలీపూర్ కోర్టులో కేసు నమోదు అయ్యింది. ఆమెకు వ్యతిరేకంగా సమన్లు కూడా జారీ అయ్యాయి.. కానీ ఆమె ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాకపోవడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి