iDreamPost

IPLకు పోటీగా ఇంగ్లండ్‌ తెచ్చిన ‘ది హండ్రెడ్‌’ లీగ్‌ రద్దు! కారణం ఇదే..

  • Published Jul 19, 2023 | 9:16 AMUpdated Jul 19, 2023 | 9:16 AM
  • Published Jul 19, 2023 | 9:16 AMUpdated Jul 19, 2023 | 9:16 AM
IPLకు పోటీగా ఇంగ్లండ్‌ తెచ్చిన ‘ది హండ్రెడ్‌’ లీగ్‌ రద్దు! కారణం ఇదే..

ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా క్రికెట్‌ను ఒక ప్రొఫెషనల్‌ గేమ్‌ నుంచి వినోదం అందించే ఇవెంట్‌గా మార్చేసింది. క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపారులకు కోట్ల ఆదాయం తెచ్చిపెడుతూ.. బీసీసీఐకి బంగారు బాతుగా అవతరించింది. ఐపీఎల్‌ గ్రాండ్‌ సక్సెస్‌ చూసి.. ప్రపంచ వ్యాప్తంగా చాలా లీగులు పుట్టుకొచ్చాయి. కానీ, ఏదీ ఐపీఎల్‌ క్రేజ్‌ను కొట్టేయలేకపోయాయి. అందుకు ప్రధాన కారణం.. ఇండియన్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో తప్ప ఎక్కడా ఆడకపోవడమే.

అయితే.. ఐపీఎల్‌ సక్సెస్‌ చూసి సేమ్‌ టీ20 లీగ్‌లను చాలా దేశాలు కాపీ కొట్టాయి. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, ఆస్ట్రేలియాలో బిగ్‌ బాష్‌ లీగ్‌, సౌతాఫ్రికాలో ఎస్‌ఏ20 లీగ్‌, యూఏఈలో ఐఎల్‌టీ20 లీగ్‌, తాజాగా అమెరికా సైతం మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీని సైతం నిర్వహిస్తోంది. ఇలా చాలా దేశాల్లో చాలానే లీగులు వచ్చాయి. అయితే టీ20 లీగ్‌లకు భిన్నంగా ఇంగ్లండ్‌ కొత్త తరహా ఫార్మాట్‌లో ఓ లీగ్‌ను తీసుకొచ్చింది. దాని పేరు ‘ది హండ్రెడ్‌’ 100 బంతుల ఇన్నింగ్స్‌ అంటూ టీ20 కంటే షార్ట్‌ ఫార్మట్‌లో క్రికెట్‌ అభిమానులకు మరింత వినోదం అందించాలనే ప్రయోగం చేసింది. ఇప్పటికే రెండు సీజన్లను సైతం పూర్తి చేసుకుంది.

కానీ, ఈ లీగ్‌కు ఆశించినంత ఆదరణ లభించలేదు సరికదా.. పైగా ఒక ఫెల్యూర్‌ లీగ్‌గా ముద్ర వేసుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌, యూఏఈ ఐఎల్‌టీ20 లీగ్‌, తాజా అమెరికాలో జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ సైతం సక్సెస్‌ కావడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుపై ఒత్తడి పెరుగుతుంది. టీ20 బ్లాస్ట్‌పేరుతో ఒక టోర్నీ ఉన్నా.. అది కూడా పెద్దగా సక్సెస్‌ కాలేదు. దీంతో టీ20 బ్లాస్ట్‌, ది హండ్రెడ్‌ లీగ్‌లను పూర్తిగా రద్దు చేసి.. వాటి స్థానంలో సరికొత్త టీ20 లీగ్‌ను తీసుకొచ్చేందుకు ఈసీబీ(ఇంగ్లండ్‌ అండ్‌ వెల్స్‌ క్రికెట్‌ బోర్డు) భావిస్తున్నట్లు సమాచారం. దీనికి ఆ దేశ కౌంటీలు సైతం అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే కౌంటీ సభ్యులతో ఈసీబీ అధికారులు సమావేశం నిర్వహించి ది హండ్రెడ్‌ను రద్దు చేయనున్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నా భార్య నన్ను కాదని అతన్ని ఇష్టపడుతోంది: స్టార్‌ క్రికెటర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి