iDreamPost

తెలంగాణలో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం

ఈ మధ్యనే న్యాల్ కల్ మండల కేంద్రంలో భూకంపం వచ్చింది. రోజుల వ్యవధిలోనే మరోసారి భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.

ఈ మధ్యనే న్యాల్ కల్ మండల కేంద్రంలో భూకంపం వచ్చింది. రోజుల వ్యవధిలోనే మరోసారి భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.

తెలంగాణలో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం

ఇటీవల పలు చోట్ల భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. భారత్, నేపాల్, ఇండోనేషియా, చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ పలు దేశాల్లో ఎక్కడో అక్కడ నిత్యం భూకంపాలు వస్తూనే ఉన్నాయి. భూకంపాల ధాటికి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. గత ఏడాది టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు.. 50 వేల మందికి పైగా చనిపోయారు.. వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పటికే అక్కడ భూకంపాలు జనాలను భయపెడుతూనే ఉన్నాయి. భారత్ లో ఈ మధ్య ఢిల్లీ, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్యనే తెలంగాణలో కూడా భూ ప్రకంపనలు భయపెట్టిస్తున్నాయి. తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూమి కంపించింది. న్యాల్కల్ మండలంలో గత నెల 27న భూకంపం రాగా.. తాజాగా 7.26 గంటల సమయంలో 4 నుంచి 5 సెకన్ల మేర భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారీ శబ్దంతో పాటు విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోవడంతో ఇళ్లలోని సామన్లు ఊగిపోయాయి.. దీంతో ప్రజలు ఒక్కసారే భయాందోళనుకు గురై బయటకు పరుగులు తీశారు. పది రోజుల వ్యవధిలోనే ఇదే ప్రాంతంలో ఇలా భూమి కంపించడం ఆందోళన కలిగిస్తుంది. గ్రామంలోని ప్రజలు మళ్లీ భూమి ఎప్పుడు కంపిస్తుందో.. ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లకు వెళ్లారు. విషయం తెలుసుకున్న అధికారుల సంఘటన ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎాలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు. సాధారణంగా భూకంపాలు ఉత్తర భారతం వైపే ఎక్కువ వస్తుంటాయి. దక్షిణ భారత్ వైపు చాలా తక్కువగా భూకంపాలు నమోదు అవుతుంటాయి. కానీ తెలంగాణలో పదిరోజుల వ్యధిలోనే రెండు సార్లు భూకంపం రావడం పై చర్చలు మొదలయ్యాయి. అసలు ఇది భూకంపం ప్రభావమేనా? లేక ఇతర కారణం ఏదైనా ఉందా అన్న విషయం గురించి తెలియాలి. ఏది ఏమైనా భూకంపం సంభవించగానే ప్రాణాల గుప్పిట్లో పెట్టుకొని వీధుల్లోకి పరుగులు పెడుతున్నాం అని బాధితులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి