SNP
SNP
క్రికెట్లో కొన్ని సార్లు బౌలర్ల దెబ్బకి బ్యాటర్లు గాయాలపాలవుతుంటారు. నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొవడంలో బ్యాటర్లు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఆడాలి అనుకున్న షాట్‌ను మిస్ అయినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బాల్ వచ్చి తగిలితే.. గ్రౌండ్లో నెత్తురు కార్చాల్సింది. అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు స్పీడ్ బౌలింగ్‌లో గాయాలపాలయ్యారు. ఆస్ట్రేలియా దేశవాళి క్రికెట్లో ఓ క్రికెటర్ బాల్ తగిలి ఏకంగా ప్రాణాలే వదిలారు.
అలాంటి ఘటనే ఇప్పుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా పునరావృతం అయ్యేది. డ్వేన్ బ్రావో వేసిన బంతి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చింది. దాన్ని ఆడేందుకు బ్యాటర్ విచిత్రమైన షాట్‌ను ప్రయత్నించాడు. అది కాస్తా.. మిస్ ఫైర్ అయి గ్లౌజ్‌లకు తాకి నేరుగా తలపైకి దూసుకొచ్చింది. బంతి తగిలిన దెబ్బకు అతని హెల్మెట్ ఎగిరి పడింది. దీంతో కొద్దిలో అతనికి ప్రాణాపాయం తప్పిందని మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా ఊపిరిపీల్చుకున్నారు. బంతి హెల్మెట్‌కు కాకుండా తలకు అంతే బలంగా తలిగిఉంటే ప్రమాదం జరిగి ఉండేది.
ఈ ఘటన వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్-ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. సెయింట్ లూసియా కింగ్స్ జట్టు ఓపెనర్ ఛార్లెస్.. నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు డ్వేన్ బ్రావో వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మీదకి వచ్చిన బంతిని స్రూప్ షాట్ ఆడబోయాడు. అది కాస్తా మిస్ అవ్వడంతో అతని గ్లౌజ్‌లకు తాకిన బంతి.. తలపైకి దూసుకొచ్చింది. వెంటనే స్పందించిన ఛార్లెస్ కాస్త తల పక్కకి జరపడంతో బాల్ హెల్మెట్‌కు తాకింది. దీంతో హెల్మెట్ వెనక్కి పడిపోయింది. బాల్ హెల్మెట్‌కు కాకుండా ఛార్లెస్ తలకు తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అంతా భయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కింద ఉన్న వీడియో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A scary moment in CPL…!!!
Thankfully Johnson Charles is fine.pic.twitter.com/uHmdxP0Y3q
— Johns. (@CricCrazyJohns) August 26, 2023
ఇదీ చదవండి: ధోనిని టార్గెట్ చేసిన సెహ్వాగ్, యువరాజ్! సంచలన వ్యాఖ్యలు