iDreamPost

వాళ్ల‌కు మసాజ్‌ చేయమ‌న్నారు … స్పోర్ట్స్ హాస్టల్‌లో ర్యాగింగ్ ను బైట‌పెట్టిన‌ ద్యుతీ చంద్

వాళ్ల‌కు మసాజ్‌ చేయమ‌న్నారు … స్పోర్ట్స్ హాస్టల్‌లో ర్యాగింగ్ ను బైట‌పెట్టిన‌ ద్యుతీ చంద్

భువనేశ్వర్‌లోని ప్రభుత్వ స్పోర్ట్స్ హాస్టల్‌లో ర్యాగింగ్‌కు గురై ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు, ప్రభుత్వ స్పోర్ట్స్ హాస్టల్‌లో సీనియర్లు, తనను ఎలా వేధించారో, మానసికంగా ఎలా హింసించారో ఇండియ‌న్ స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ బైట‌ప‌ట్ట‌టింది. ఒడిశాలో విద్యార్ధి ఆత్మ‌హ‌త్య సంచ‌ల‌నం సృష్టించింది. మ‌రోసారి ర్యాగింగ్ ఉదంతాన్ని బైట‌పెట్టింది. రుచిక ఆత్మహత్య చేసుకున్న హాస్టల్‌లోనే ద్యుతీ 2006 నుంచి 2008 వరకు గడిపింది. ఈ ర్యాగింగ్ కు నేనూ బాధితురాలినే అని ద్యుతీ చంద్ చెప్పారు.

2006-2008 మధ్య, భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ హాస్టల్‌లో తాను ట్ర‌యినింగ్ తీసుకొంటున్న‌ప్పుడు, ఆనాటి సీనియర్లు తనను వేధించారని, ర్యాగింగ్ చేశారని ద్యుతీ ఆరోపించింది. పోర్ట్స్ హాస్టల్‌లో తమకు మ‌సాజ్ చేయ‌మ‌ని అడిగేవారు. బట్టలు ఉతకమని సీనియర్లు బలవంతం చేసేవారని, నేను అలా చేయ‌న‌ని చెప్పిన‌ప్పుడు వేధించేవార‌ని ద్యుతీ సోషల్ మీడియా పోస్ట్‌లో ఆరోపించారు.

సీనియర్లపై కంప్లైంట్ చేస్తే, తనను రివర్స్‌లో తిట్టేవాళ్లని, అధికారులు తన పేదరికాన్ని అవ‌హేళ‌న చేసేవారని బాధ‌ప‌డింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి