iDreamPost

పెద్దలు విడదీసినా.. సనాతన ధర్మం ప్రకారం జైల్లో ప్రేమ పెళ్లి!

  • Published Feb 28, 2024 | 4:11 PMUpdated Feb 28, 2024 | 4:11 PM

సాధారణంగా పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో జరుగుతాయంటారు. కానీ దానికి భిన్నంగా ఓ ప్రేమ జంట మాత్రం ఏకంగా జైలు లో వివాహం చేసుకున్నారు. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సాధారణంగా పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో జరుగుతాయంటారు. కానీ దానికి భిన్నంగా ఓ ప్రేమ జంట మాత్రం ఏకంగా జైలు లో వివాహం చేసుకున్నారు. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Feb 28, 2024 | 4:11 PMUpdated Feb 28, 2024 | 4:11 PM
పెద్దలు విడదీసినా.. సనాతన ధర్మం ప్రకారం జైల్లో ప్రేమ పెళ్లి!

చాలామంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకోవడంలో విఫలం అవుతారు. మరికొందరు మాత్రం పెద్దలను ఎదిరించి, ఒప్పించైనా ఇష్టపడిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది తమ పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే.. ప్రతిఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన జ్ఞాపకం. అందుకే దీనిని ఎంతో ఆద్భుతంగా గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ ఆశ పడుతుంటారు.కానీ, అనుకొని రీతిలో విధి కొందరి జీవితాలను తలకిందులు చేస్తుంది.అచ్చం అలానే ఓ ప్రేమ జంటను నేర ఆరోపణ కారణంగా విడదీసింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఆ ప్రేమ జంటను మళ్లీ జైలు లో కలిపింది.

సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అచ్చం ఆ మాటకు నిదర్శనంగా ఈ ప్రేమ జంట విషయంలో జరిగింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..భువనేశ్వర్ లోని ఝరపడా ప్రత్యేక జైలు లో సోమవారం ఓ ప్రేమ జంటకు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇదే జైలులో నేర ఆరోపణ కింద శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ ప్రేమికులు ఇలా జైలు లో వివాహం చేసుకోవడానికి వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థలని కారణమని, అందుకే అమ్మాయి తరుపు వారు ఆ యువకుడి పై ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొన్నిరోజులకి ఈ వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు ఆనందకరమైన మలుపు దక్కింది. కాగా, ఇరువురి కుటుంబాలు తమ మనసును మార్చుకుని సమస్యకు పరిష్కారంగా.. వీరిద్దరి పెళ్లి చేయాలని హృదయపూర్వకంగా ముందుకు వచ్చారు. దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలోనే.. జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు తన ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారులు ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు.

ఇక వీరి అభ్యర్థన విన్న జైలు అధికారులు, న్యాయ శాఖ అథికార వర్గాలు సానుకూలంగా స్పందించడంతో పాటు స్వచ్ఛందంగా వీరి పెళ్లి తంతును జరిపించడం కోసం ప్రోత్సహించి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే చట్టపరమైన లాంఛానాలతో వీరి పెళ్లి జరిగింది. కాగా, జైలు అధికారులు అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు.మరి, జైలు లో వివాహం చేసుకున్న ఈ ప్రేమ జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి