iDreamPost

భారతీయుల పిల్లలకు చేసే మసాజ్ రహస్యం కనిపెట్టిన శాస్త్రవేత్తలు!

మసాజ్ తో శరీరం తేలికగా అవడంతో పాటు మంచి ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలకు కూడా మసాజ్ చేస్తుంటారు తల్లులు. మరి పిల్లలకు మసాజ్ చేయడం ఆరోగ్యకరమేనా. మసాజ్ వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏంటీ?

మసాజ్ తో శరీరం తేలికగా అవడంతో పాటు మంచి ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలకు కూడా మసాజ్ చేస్తుంటారు తల్లులు. మరి పిల్లలకు మసాజ్ చేయడం ఆరోగ్యకరమేనా. మసాజ్ వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏంటీ?

భారతీయుల పిల్లలకు చేసే మసాజ్ రహస్యం కనిపెట్టిన శాస్త్రవేత్తలు!

ఒత్తిడిని, శారీరక అలసటను తీర్చుకునేందుకు చాలా మంది మసాజ్ చేయించుకుంటుంటారు. మసాజ్ తో శరీరం తేలికగా అవడంతో పాటు మంచి ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలకు కూడా మసాజ్ చేస్తుంటారు తల్లులు. మరి పిల్లలకు మసాజ్ చేయడం ఆరోగ్యకరమేనా. మసాజ్ వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏంటీ? అసలు పిల్లలకు మసాజ్ ఎలా చేయాలి? అనే విషయాలపై పలువురు శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు చేసి పిల్లలకు చేసే మసాజ్ రహస్యాలను కనిపెట్టారు. ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం.

చిన్నపిల్లలకు నూనె రాసి మసాజ్ చేయడం వందల ఏళ్లుగా ఉన్న అలవాటు. నెలలు నిండ కుండా పుట్టే పిల్లలకు మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని దక్షిణాసియాలో అనేక శాస్త్రీయ ఆధారాలు లభించాయి. మసాజ్ తో చిన్నారులు సరైన బరువు పెరగడమే కాకుండా బాక్టీరియా ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లను నివారిస్తుందని, శిశు మరణాలను 50 శాతం వరకు తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మసాజ్ తో లాభాలేంటి? ఎవరికీ లాభం? ఎలాంటి నూనెను ఎంచుకోవాలి. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న వయసులో మసాజ్.. యుక్త వయసులో ప్రయోజనం:

చిన్నారులకు మసాజ్ చేయడం ద్వారా వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. వారికి యుక్త వయసు వచ్చే వరకు నిలిచి ఉంటాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. శరీరలో చర్మం అతిపెద్ద అవయవం. కానీ చర్మ సంరక్షణకు మిగిలిన అవయావాల కన్నా తక్కువ ప్రాధాన్యత ఇస్తామని స్టాన్ ఫర్డ్ మెడిసిన్స్ స్కూల్ ప్రోఫెసర్ తెలిపారు. బంగ్లాదేశ్, భారత్ లో ఆయన పర్యటించినప్పుడు అక్కడ పుట్టిన చిన్నారులకు వారి తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు మసాజ్ చేయడం ఆయన చూసినట్లు తెలిపారు. ఈ మాసాజ్ ను కొన్ని వందల ఏళ్లుగా చేస్తున్నామని వారు చెప్పినప్పుడు ఆ ప్రొఫెసర్ ఆశ్చర్యపోయానని వెల్లడించారు. దీంతో ఆయన దీనిపై అధ్యయనం ప్రారంభించారు.

బాక్టీరియాను అరికడుతుంది:

బంగ్లాదేశ్ లో ఓ ఆసుపత్రిలో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు సంప్రదాయ పద్దతిలో మసాజ్ చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడగలదని డార్మ్ స్టాట్ బృందం కనుగొంది. దీని వల్ల ఇన్ ఫెక్షన్లు తగ్గడం శిషు మరణాలు సైతం తగ్గుముఖం పట్టిందని వారు తెలిపారు. శిషువులకు మసాజ్ చేస్తే వారిలో మైక్రో బయోమ్ తయారీకి సహాయపడుతుందని కనుగొన్నారు. కాగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఇన్ ఫెక్షన్లను తరిమికొట్టడంలో మైక్రోబయోమ్ ఉపయోగపడుతుంది. పోషకాహార లోపంతో పుట్టిన శిశువులకు కూడా వివిధ రకాల తైలాలతో మసాజ్ చేసినప్పుడు మైక్రోబయోమ్ వృద్ధి చెందినట్లుగా కనుగొన్నారు. మసాజ్ చేయడం వల్ల శిశువుల శరీరం దృఢంగా మారి సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని తెలిపారు.

నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో శరీరంపై నిరోదకాలు సక్రమంగా పనిచేయవు. దాంతో శరీరంలో నుంచి ఎక్కువ నీరు బయటికి పోతుంది. శిశువులో ఉష్ణం కూడా తగ్గుతుంది. శిశువు హైపోథర్మిక్ కండీషన్ కు లోనవుతుంది. ఇది ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఎదుగుదలకు ఇతర జీవక్రియలకు వినియోగించాల్సిన శక్తిని ఈ ఉష్ణాన్ని కోల్పోవడానికి వినియోగించడం వల్ల శిశువు బలహీన పడుతుందని డార్మ్ స్టాట్ చెప్పారు. డార్మ్ స్టాట్ బృందం యూపీలో దాదాపు 26 వేల మంది శిశువులపై అధ్యయనం చేశారు. కొంతమందికి సన్ ఫ్లవర్ ఆయిల్ తో, మరికొంత మందిని ఆవ నూనెతో మసాజ్ చేశారు. పిల్లలందరిలోనూ ఎదుగుదలను వీరు గమనించారు. అయితే సాధారణ బరువుతో పుట్టి మరణించిన శిశువుల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించలేదు.

The secret of massaging children has been discovered

తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో మాత్రం ఈ మాసాజ్ ప్రక్రియ 52 శాతం మరణాలను తగ్గించినట్లు తెలిపారు. మెదడు నుంచి పొట్టకు అనుసందానంగా ఉండే వేగస్ నరాన్ని మసాజ్ ప్రేరేపిస్తుందని అధ్యయనంలోతేలింది. దీంతో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి శరీరానికి పోషకాలు అందుతాయి. పిల్లలు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రోజు పొట్టను మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, నొప్పికూడా తగ్గుతాయి. అయితే నెలలు నిండ కుండా పుట్టిన పిల్లలకు ఇది చాలా ముఖ్యం. అయితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు గట్టిగా మసాజ్ చేయకూడదని డార్మ్ స్టాట్ చెప్పారు. మసాజ్ కు వాడే తైలాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలని తెలిపారు.

సన్ ఫ్లవర్ నూనె కొబ్బరి నూనె, నువ్వుల నూనె అన్ని కూడా ఒకే రకమైన ప్రయోజనాలను కలుగ చేస్తాయని డార్మ్ స్టార్ట్ బృందం అధ్యయనం చెప్పింది. ఈ నూనెల్లో లినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో తయారవ్వదు. శరీరంలోని గ్రాహకాల ద్వారా వీటిల్లోని ఫాటీ ఆమ్లాలు శరీరంలోకి చేరుతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆవనూనెలో యూరిసిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో వాపును కలుగ చేస్తుంది. చర్మంపై ఉండే నిరోధకాలకు హాని చేసే ప్రమాదం ఉందని డార్మ్ స్టాట్ చెప్పారు. ప్రతిరోజు మసాజ్ చేయడం వల్ల చిన్నారి నిద్ర, చర్మ కాంతికూడా మెరుగవుతాయి. అయితే తమ పిల్లలకు మసాజ్ చేయాలనుకునే తల్లిదండ్రులు వారికి అది సురక్షితమో కాదో వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. చిన్నారులకు మసాజ్ చేసే విషయంలో శాస్త్రవేత్తలు భారతీయులను ప్రశంసిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి