iDreamPost

వీడియో: జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన జనం!

ఈ మద్య దేశ వ్యాప్తంగా తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం సాంకేతిక లోపాలు అని అధికారులు అంటున్నారు.

ఈ మద్య దేశ వ్యాప్తంగా తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం సాంకేతిక లోపాలు అని అధికారులు అంటున్నారు.

వీడియో: జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన జనం!

ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎక్కువగా రైలు ప్రయాణాలు సురక్షితం అని భావిస్తుంటారు. రైలు బయలు దేరిన తర్వాత సాంకేతి ఇబ్బందులు తలెత్తడం వల్ల, మనుషులు చేసే తప్పిదాల వల్ల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఒడిశఆలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశ వ్యాప్తంగా ఒక్కసారే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన తర్వాత పలుమార్లు రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశంలో మరో రైలుకు పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ 7, గురువారం తెల్లవారుజామున ఒడిశాలోని కటక్ స్టేషన్ వద్ద ప్రయాణికులు ప్రయాణిస్తున్న భువనేశ్వర్ – హౌరా జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైల్ కోచ్ లో బ్రేక్ షూ నుంచి ఉన్నట్టుండి పొగలు రావడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అదృష్ట వశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం, గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని అందర ఊపిరి పీల్చుకున్నారు. అంతా ఓకే అని క్లారిటీ తీసుకున్న తర్వాత రైలుని గమ్యస్థానానికి పంపించారు అధికారులు.

ఈ ఘటన గురించి రైల్వే అధికారులు ఏమన్నారంటే.. భువనేశ్వర్ నుంచి హౌరా వెళ్తున్న జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో కటక్ చేరుకుంది. ధూలియన్‌గంగ, బల్లాల్‌పూర్‌ స్టేషన్ల మధ్యకు రాగానే కోచ్ దిగువ భాగంలో పొగలు వెలువడ్డాయి. హఠాత్తుగా పొగలు కమ్ముకోవంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనై ఆగి ఉన్న రైలు నుంచి కిందకు దిగి పరుగులు తీశారు. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పి పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకువచ్చారు. ఈఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, మంటలు ఆరిపోయిన తర్వాత రైలు 7:15 ప్రాంతంలో కటక్ నుంచి బయలు దేరి వెళ్లిపోయిందని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశంలో తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి