iDreamPost

60 గజాల స్థలంలో కేవలం రూ.15 లక్షలకే డ్యూప్లెక్స్ హౌజ్

  • Published Apr 19, 2024 | 4:22 PMUpdated Apr 19, 2024 | 4:22 PM

తక్కువ స్థలంలో.. తక్కువ బడ్జెట్‌తో.. మీ కలల ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తున్నారా.. అయితే ఈ దంపతులను ఫాలో అవ్వండి. వీరు కేవలం 60 గజాల స్థలంలో.. 15 లక్షల రూపాయల్లో ఇంటిని నిర్మించారు. ఆ వివరాలు..

తక్కువ స్థలంలో.. తక్కువ బడ్జెట్‌తో.. మీ కలల ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తున్నారా.. అయితే ఈ దంపతులను ఫాలో అవ్వండి. వీరు కేవలం 60 గజాల స్థలంలో.. 15 లక్షల రూపాయల్లో ఇంటిని నిర్మించారు. ఆ వివరాలు..

  • Published Apr 19, 2024 | 4:22 PMUpdated Apr 19, 2024 | 4:22 PM
60 గజాల స్థలంలో కేవలం రూ.15 లక్షలకే డ్యూప్లెక్స్ హౌజ్

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అంటే ఈ రెండు పనులు ఎంతో కష్టమైనవనే అర్థం. నేటి కాలంలో ఇల్లు కట్టాలన్నా.. పెళ్లి చేయాలన్నా.. లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. మధ్యతరగతి వారికి అయితే ఇవి పెను భారంగా మారాయి. అప్పు చేయకుండా పెళ్లి చేయడం, ఇల్లు కట్టడం దాదాపు అసాధ్యం. ఇక పెళ్లి సంగతి కాసేపు అలా ఉంచితే.. ప్రతి మనిషి తాను చనిపోయేలోపు.. తనకంటూ సొంతంగా ఇల్లు ఉండాలని ఆశపడతాడు. అయితే నేటి కాలంలో ఇల్లు కట్టడం అనేది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా ఈ రోజుల్లో ఇల్లు కట్టడానికి ఎంత లేదన్నా కనీసం 120 గజాల స్థలం కావాలి అనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే వ్యక్తులు.. కేవలం 60 గజాల స్థలంలో15 లక్షల రూపాయల వ్యయంతో అద్భుతమైన ఇంటిని నిర్మించి.. అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ వివరాలు..

తక్కువ స్థలంలో.. తక్కువ ఖర్చుతో మనసుకు నచ్చినట్లు ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కరీనంగర్‌కు చెందిన దంపతులు ఆదర్శంగా నిలిచారు. వీరు కేవలం 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఇంజనీర్‌ను సంప్రదించారు. కానీ వారు ఇచ్చిన ప్లాన్‌ సరిగా లేకపోవడంతో.. ఆ దంపతులే స్వయంగా తమకు నచ్చినట్లు ఇంటి నిర్మాణం ప్రారంభించారు. తమకున్న పరిజ్ఞానంతో డూప్లెక్స్‌ హౌస్‌ను కట్టారు. ఇంటి నిర్మాణానికి 15 లక్షలు ఖర్చవుతుంది అని అంచనా వేశారు.

Flat for 15 lakhs

కాకపోతే వీరికి మరో 5 లక్షలు అదనంగా ఖర్చయింది. అందుకు కారణం ఇంటికి తెచ్చిన ఫర్నిచర్‌, సోఫాసెట్స్‌, ఏసీ ఇలా అదనపు హంగులు చేర్చడం వల్ల ఎక్కువ అమౌంట్‌ అయ్యింది అంటున్నారు. ఇక ఈ దంపతులు వారికి ఉన్న కొద్ది పాటి స్థలంలోనే సెంటు జాగాను కూడా వృథా చేయకుండా ఇంటిని నిర్మించారు. కింద ఫ్లోర్‌లో పార్కింగ్‌.. అందులో నుంచి పైకి వెళ్లడానికి మెట్లు నిర్మించారు. పైకి వెళ్లగానే చిన్న హాల్‌, దానికి పక్కన ఓపెన్‌ మోడల్‌ కిచెన్‌.. దాన్నుంచి బెడ్‌ రూమ్‌లోకి వెళ్లడానికి దారి. లోపల నుంచి వెళ్లి చూస్తే మాస్టర్‌ బెడ్రూమ్‌.. మరోకవైపు నార్మల్‌ బెడ్రూమ్‌ వచ్చేలా ఇంటిని నిర్మించారు.

మాస్టర్ బెడ్ రూమ్‌లో పెద్ద సైజు కబోర్డ్స్, అటాచ్డ్‌ బాత్రూం.. మళ్లీ బాల్కనీ వైపు వచ్చి చూస్తే.. మరో బెడ్రూం. దీనిలో ఇద్దరు పిల్లలు పడుకోవడానికి రెండు బెడ్స్, పిల్లల వస్తువులు పెట్టడానికి పైన కబోర్డ్స్ మళ్లీ బయటికి వస్తే బాల్కనీ డైరెక్ట్ గా కిందికి వెళ్లడానికి మెట్లు ఈ విధంగా వారికున్న అతి తక్కువ స్థలాన్ని ఒక ఇంచు కూడా వేస్ట్ చేయకుండా చాలా అందంగా ఇంటిని నిర్మించారు. అయితే ఇలా విదేశాల్లో నిర్మిస్తారు. ఇప్పుడు ఈ మోడల్‌​.. కరీంనగర్‌లో దర్శనం ఇవ్వడం అద్భుతమని అంటున్నారు. తక్కువ స్థలంలోనే ఇంత అందంగా ఇంటిని నిర్మించిన వీరు ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు కూడా తక్కువ స్థలంలో ఇంటిని నిర్మించాలంటే.. వీరిని ఫాలో అవ్వండి. ఖర్చు తక్కువ.. మీకు నచ్చినట్లు ఇల్లు కట్టుకున్నామనే తృప్తి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి