iDreamPost

సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అంతకన్నా ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే!

సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నారా? అయితే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఈ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లను ఒకసారి పరిశీలించండి.

సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నారా? అయితే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఈ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లను ఒకసారి పరిశీలించండి.

సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అంతకన్నా ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే!

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రేటే ఎక్కువ. ప్రస్తుతం ఈ పథకంలో 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే ఈ వడ్డీ రేటు మూడు నెలలకొకసారి మారుతూ ఉంటుంది. ఈ వడ్డీ రేటు అనేది కొన్నిసార్లు పెరగచ్చు.. తగ్గచ్చు.. లేదా స్థిరంగా ఉండచ్చు. ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన ఈ స్కీంలో లాంగ్ టర్మ్ లో భారీగా లాభాలు వస్తాయి. నెలకు కొంత పెట్టుబడి చొప్పున వరుసగా 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. మెచ్యూరిటీ సమయానికి లక్షల్లో లాభాలు వస్తాయి. అయితే సుకన్య సమృద్ధి యోజన కంటే కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ ఇస్తున్నాయి. అయితే ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన స్కీంలో రెగ్యులర్ పొదుపు ఖాతాలతో పోలిస్తే అధిక వడ్డీ సహా పన్ను ప్రయోజనం పొందుతారన్న విషయం మర్చిపోకూడదు. ఈ ఒక్కటీ పక్కన పెడితే.. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద సుకన్య సమృద్ధి యోజన పథకంలో వచ్చే వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులేమిటో ఓ లుక్కేయండి.   

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

700 రోజుల నుంచి గరిష్టంగా రెండేళ్ల వరకూ మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వడ్డీ అందిస్తుంది. 2 నుంచి 3 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ కి డిపాజిట్లపై ఏకంగా వడ్డీ రేటు 8.50 శాతం అందిస్తుంది.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అయితే.. ఏడాది నుంచి 15 నెలల డిపాజిట్ పై 8.25 శాతం వడ్డీ అందిస్తుంది. 15 నెలల నుంచి రెండేళ్ల డిపాజిట్ పై 8.50 శాతం వడ్డీ అందజేస్తుంది. రెండేళ్ల నుంచి రెండేళ్ల ఒకరోజు డిపాజిట్లపై 8.60 శాతం వడ్డీ అందిస్తుంది. 

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 15 నెలల ఫిక్స్డ్ డిపాజిట్ పై 8.50 శాతం వడ్డీ రేటు వస్తుంది. 2 నెలల నుంచి 15 నెలలు, 15 నెలల ఒక రోజు నుంచి 560 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.25 వడ్డీ అందిస్తుంది.  

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఏడాది పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే.. 8.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాది నుంచి రెండేళ్ల పాటు డిపాజిట్ చేస్తే 8.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 444 రోజులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన కస్టమర్ కి 8.50 శాతం వడ్డీ లభిస్తుంది. అదే 888 రోజుల వ్యవధిపై 8.25 శాతం వడ్డీ అందిస్తుంది. 

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐతే.. 6 నెలల నుంచి 201 రోజుల వరకూ ఫిక్స్డ్ డిపాజిట్ పై 8.75 శాతం వడ్డీ అందిస్తుంది. 501 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పై 8.75 శాతం, 701 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పై 8.95 శాతం, 1001 రోజుల డిపాజిట్ పై 9 శాతం వడ్డీ అందిస్తుంది. 

ఇవే సుకన్య సమృద్ధి యోజన పథకం కంటే కూడా ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి