iDreamPost

Dunki: ‘డంకీ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..?

  • Published Dec 22, 2023 | 12:41 PMUpdated Dec 22, 2023 | 12:41 PM

కింగ్ ఖాన్ షారుక్ నటించిన ‘డంకీ’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కింగ్ ఖాన్ షారుక్ నటించిన ‘డంకీ’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 22, 2023 | 12:41 PMUpdated Dec 22, 2023 | 12:41 PM
Dunki: ‘డంకీ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..?

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ ఈ ఏడాది సూపర్ ఫామ్​లో ఉన్నారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేక రేసులో వెనుబడిపోయిన కింగ్ ఖాన్.. ఈ సంవత్సరం స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇచ్చారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్​తో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. ఏడాది మొదట్లో ‘పఠాన్’తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ ఫిల్మ్ రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఆ తర్వాత ‘జవాన్’తో మరోమారు వెయ్య కోట్ల మార్క్​ను టచ్ చేశారు షారుక్. రెండు వరుస విజయాలతో ఫుల్ జోష్​లో ఉన్న ఆయన తన కొత్త చిత్రం ‘డంకీ’ని డిసెంబర్ 21న విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ రాజ్​కుమార్ హిరానీ-షారుక్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ మూవీ ఫస్ట్ డే ఆశించినంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ‘డంకీ’కి కొంత పాజిటివ్ టాక్ వచ్చినా.. ఒక వర్గం ఆడియెన్స్​ను మాత్రమే అలరిస్తోందని తెలుస్తోంది.

నార్త్​లో బిగ్ ఎక్స్​పెక్టేషన్స్ మధ్య రిలీజైన ‘డంకీ’ వసూళ్ల వేటలో వెనుకబడిపోయింది. ఈ ఏడాది షారుక్ నుంచి వచ్చిన ‘పఠాన్’, ‘జవాన్’ తొలి రోజు కలెక్షన్స్​ను ‘డంకీ’ దాటలేకపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. ఈ ఫిల్మ్ ఫస్ట్ డే వరల్డ్​వైడ్ రూ.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే.. రూ.30 కోట్లు. ఈ ఇయర్ రిలీజైన ‘పఠాన్’ మొదటి రోజు రూ.106 కోట్లు వసూలు చేయగా.. ‘జవాన్’ రూ.129 కోట్లు రాబట్టింది. రెండు వరుస విజయాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ‘డంకీ’ రూ.130 కోట్ల మార్క్​ను ఈజీగా క్రాస్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అందులో కింగ్ ఖాన్ కొత్త మూవీ ఫెయిలైంది. క్రేజీ కాంబోలో వచ్చిన ఈ ఫిల్మ్ లాంగ్​ రన్​లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. అయితే ఈ కలెక్షన్స్ చూసి ‘సలార్​’కు ‘డంకీ’ లైన్ క్లియర్ చేసిందని ప్రభాస్ అభిమానులు అంటున్నారు.

‘డంకీ’కి హిట్ టాక్ రాకపోవడం ‘సలార్’కు బాగా కలిసొస్తుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక, ప్రభాస్ కొత్త సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం, మౌత్ పబ్లిసిటీ కూడా ఫుల్ పాజిటివ్​గా ఉండటంతో కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. నార్త్​లో ‘డంకీ’ మేకర్స్ భారీగా థియేటర్లను బ్లాక్ చేయడంతో ‘సలార్’కు స్క్రీన్స్ విషయంలో అన్యాయం జరిగిందని వార్తలు వచ్చాయి. సింగిల్ స్క్రీన్స్​తో పాటు మల్టీప్లెక్సులను కూడా బ్లాక్ చేశారని సోషల్ మీడియాలోనూ న్యూస్ వచ్చింది. అయితే ‘డంకీ’కి ఇప్పుడు వస్తున్న వసూళ్లు, మౌత్ టాక్ పెద్దగా లేకపోవడంతో ఆ థియేటర్లను ‘సలార్​’కు కేటాయిస్తున్నారని వినికిడి. కలెక్షన్స్ డ్రాప్ అవుతూ పోతే వీకెండ్​కే ‘డంకీ’ని ఎత్తేసి ‘సలార్’ను ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒకవేళ అదే జరిగితే నార్త్​లో ప్రభాస్ మూవీ వసూళ్ల జాతర చేసుకోవచ్చు. మరి.. ‘డంకీ’ని మీరు చూశారా? ఒకవేళ చూసినట్లయితే షారుక్ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Salaar: సలార్ టార్గెట్ డంకీ కాదు.. ఏకంగా జవాన్ రికార్డుపై కన్ను!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి