iDreamPost
android-app
ios-app

Double Trouble OTT: సైలెంట్ గా OTT లోకి సమంత కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jun 21, 2024 | 7:52 AM Updated Updated Jun 21, 2024 | 7:52 AM

ఇప్పుడు ఓటీటీ లో ఉన్న సినిమాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూసేయండి. ఎందుకంటే.. ఓటీటీ లో కొత్త సినిమాలు వచేస్తున్నాయి. మరి ఈ క్రమంలో తాజాగా మరో సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇప్పుడు ఓటీటీ లో ఉన్న సినిమాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూసేయండి. ఎందుకంటే.. ఓటీటీ లో కొత్త సినిమాలు వచేస్తున్నాయి. మరి ఈ క్రమంలో తాజాగా మరో సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.

  • Published Jun 21, 2024 | 7:52 AMUpdated Jun 21, 2024 | 7:52 AM
Double Trouble OTT: సైలెంట్ గా OTT లోకి సమంత కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఈ వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ముందుగా అనౌన్సుమెంట్ తో వచ్చిన సినిమాలు కొన్నైతే.. అసలు ఏ బజ్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఇంకొన్ని. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఓ తమిళ మూవీకి ఇప్పుడు హిందీ డబ్బడ్ వెర్షన్ రిలీజ్ అయింది. ఇది రీసెంట్ గా వచ్చిన సినిమా అయితే కాదు. తమిళ్ లో ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అయిపొయింది. ఇక రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి రావడం విశేషం. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇంతకీ విజయ్ సేతుపతి, సమంత, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఏదంటే.. ” కాథు వ‌కుల రెండు కాద‌ల్ “. ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీ వెర్షన్ “డబుల్ ట్రబుల్” పేరుతో రెండేళ్ల తర్వాత ఓటీటీ లో రిలీజ్ చేయడం విశేషం. పైగా ఈ సినిమాను నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా.. స్వయంగా నయనతార ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం మరొక విశేషం. ఈ సినిమాలో ముగ్గురు స్టార్ సెలెబ్రిటీలు లీడ్ రోల్ లో నటించడంతో.. ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ బజ్ ఏర్పడింది. కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఈ సినిమా థియేటర్ లో మిక్స్‌డ్ టాక్‌ సంపాదించుకుంది. అయినా సరే నెగిటివ్ టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా దాదాపు 70 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీ వెర్షన్ “డబల్ ట్రబుల్”.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. విజయ్ సేతుపతి ఈ సినిమాలో.. తన జీవితం మొదటి నుంచి దురదృష్టంలోనే గడుస్తుందని భవిస్తూ ఉంటాడు. చిన్నపటినుంచి కూడా అతను ఏది కోరుకున్న అది అసలు జరగదు. పైగా అతని కుటుంబానికి ఉన్న శాపం కారణంగా.. అతని పెళ్ళి విషయంలో కూడా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. పగలు క్యాబ్ డ్రైవర్ గా, రాత్రి ఓ పబ్ లో బౌన్సర్ గా పనిచేస్తూ ఉంటాడు, ఈ క్రమంలోనే అతని జీవితంలోకి.. నయనతార, సమంత ఇద్దరు అనుకోకుండా ఒకేసారి వస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది ! వారిద్దరూ విజయ్ ను ఇష్టపడతారా! ఆ ఇద్దరిలో విజయ్ ఎవరిని ప్రేమిస్తాడు ! కథ ఎలా ముందుకు సాగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.