iDreamPost
android-app
ios-app

పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్ పై ప్రశ్నల వర్షం.. అక్కడ ఎదురైన ప్రశ్నలు ఇవే

  • Published Sep 26, 2024 | 5:31 PM Updated Updated Sep 26, 2024 | 5:31 PM

Choreographer Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు గురించి తెలియనిది కాదు. ఈ క్రమంలో ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి జానీ మాస్టర్ కు ఎదురైనా ప్రశ్నలు ఏంటో చూద్దాం.

Choreographer Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు గురించి తెలియనిది కాదు. ఈ క్రమంలో ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి జానీ మాస్టర్ కు ఎదురైనా ప్రశ్నలు ఏంటో చూద్దాం.

  • Published Sep 26, 2024 | 5:31 PMUpdated Sep 26, 2024 | 5:31 PM
పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్ పై ప్రశ్నల వర్షం.. అక్కడ ఎదురైన ప్రశ్నలు ఇవే

తాజాగా అందరి ఫోకస్ యూట్యూబర్ హర్ష సాయి మీదకు మళ్లింది. కానీ దానికి ముందు వరకు కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం.. మీడియా సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా కుదిపేసింది. తానూ మైనర్ గా ఉన్నప్పటినుంచి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ.. జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీనితో వేంటనే ఈ వార్తా మీడియా సోషల్ మీడియాలో అందరిని కదిలించింది. గోవాలో జానీ మాస్టర్ ను పట్టుకున్న పోలీసులు.. అతనికి 14 రోజుల రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. పోలీసులకు పట్టుబడిన తర్వాత మొదటి సారి మీడియా ముందుకు వచ్చి.. న్యాయంగా బయటకు వస్తానని నీటి వాఖ్యలు చెప్పి లోనికి వెళ్ళాడు. ఇలా వెళ్ళాడో లేదో కొద్దీ గంటల్లోనే రిమాండ్ రిపోర్ట్ లో తప్పు ఒప్పుకున్నట్లు తేలింది. దీనితో ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో మాస్టర్ కు పోలీసుల నుంచి ఎదురైనా ప్రశ్నలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బాధిత యువతి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగానే జానీ మాస్టర్ కు.. కస్టడీలో ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 4 గంటల వరకు కూడా జానీ మాస్టర్ ను పోలీసులు విచారించినట్లు తెలుస్తుంది. షూటింగ్ సమయంలో క్యారవ్యాన్ లో యువతిని వేదించవా ? మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసావా ? నాలుగేళ్ల నుంచి యువతిపై అత్యాచారం చేశావా ? ముంబై హోటల్ లో అర్ధరాత్రి యువతి రూమ్ లోకి వెళ్లి ఏం చేశావ్ ? అంటూ జానీ మాస్టర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. అయితే వీటిలో ఏ ఒక్కదానికి కూడా జానీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సమాచారం. ఆరోజు ముంబైకి వెళ్ళినప్పుడు ఆధార్ తో పాటు మరికొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని తన రూమ్ కి రావాలంటూ.. వేధించినట్లు ఆ యువతి ఆల్రెడీ కంప్లైంట్ లో పేర్కొంది. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అడిగిన ప్రశ్నలన్నీ కూడా బాధిత యువతి పేర్కొన్న విషయాలే. కానీ జానీ మాస్టర్ మాత్రం పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో.. పోలీసులు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు.

ఈ క్రమంలో బాధిత యువతి జానీ మాస్టర్ వైఫ్ పైన కూడా కంప్లైంట్ లో పేర్కొంది. దీనితో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు మాత్రం అతను ఏ తప్పు చేయలేదని బలంగా నమ్ముతున్నారు. మరి పోలీసుల సమగ్ర విచారణ పూర్తయితే కానీ అసలు విషయం ఏంటి అనేది బయటకు రాదు. ప్రస్తుతానికైతే అటు మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ రకరకాల విషయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో నిజా నిజాలు ఏంటో త్వరలోనే భయపడే అవకాశం ఉంది. మరి కస్టడీలో జానీ మాస్టర్ కు ఎదురౌతున్న ప్రశ్నలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet Girişcasibom