iDreamPost
android-app
ios-app

తారక్ అభిమానులకు షాక్.. అక్కడ 1 AM షోస్ క్యాన్సిల్

  • Published Sep 26, 2024 | 6:17 PM Updated Updated Sep 26, 2024 | 6:17 PM

Devara 1 AM Shows Cancelled In Bramaramba: దేవర సినిమాను తెరపై చూడడానికి అభిమానులంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చాలా థియేటర్స్ లో దేవర సినిమాను అర్ధరాత్రి 1 గంట నుంచే స్టార్ చేయనున్నారు. కానీ ఆ ఒక్క ప్లేస్ లో మాత్రం 1AM షోస్ ను క్యాన్సిల్ చేయనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Devara 1 AM Shows Cancelled In Bramaramba: దేవర సినిమాను తెరపై చూడడానికి అభిమానులంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చాలా థియేటర్స్ లో దేవర సినిమాను అర్ధరాత్రి 1 గంట నుంచే స్టార్ చేయనున్నారు. కానీ ఆ ఒక్క ప్లేస్ లో మాత్రం 1AM షోస్ ను క్యాన్సిల్ చేయనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 26, 2024 | 6:17 PMUpdated Sep 26, 2024 | 6:17 PM
తారక్ అభిమానులకు షాక్.. అక్కడ 1 AM షోస్ క్యాన్సిల్

దేవర సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా.. తారక్ ను తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని.. తారక్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చాలా థియేటర్స్ లో అర్ధరాత్రి 1గంట నుంచే షోస్ ను ప్రదర్శించనున్నారు. చాలా వరకు టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి కూడా. అయితే ఒక్క ప్లేస్ లో మాత్రం తారక్ అభిమానులకు షాక్ తగిలింది. తారక్ అభిమానులంతా సెంటిమెంట్ గా భావించే.. కూకట్పల్లి భ్రమరాంబ, మల్లి కార్జున థియేటర్స్ లో మాత్రం 1 AM షోస్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా.. థియేటర్ బయట బోర్డు పెట్టారు. వాస్తవానికి ఈ రెండు థియేటర్స్ లో కూడా ఆల్రెడీ 1 AM షోస్ కు టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ ఇంకొన్ని గంటల్లో సినిమా చూస్తాం అనుకునే లోపు ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజానికి నందమూరి హీరోల సినిమాలన్నిటిని కూడా.. ఈ థియేటర్స్ లో చూడడానికి సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. అభిమానులే కాదు.. అటు హీరోలు , దర్శకులు సైతం తమ ఫ్యామిలీస్ తో కలిసి ఇక్కడికే వచ్చి సినిమాలను చూస్తూ ఉంటారు. ఈ థియేటర్స్ అందరికి చాలా సెంటిమెంట్. అలాంటిది ఉన్నట్లుండి అక్కడ 1 AM షోస్ రద్దు చేయడంతో.. అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. దానికి కారణం ఏంటంటే.. టికెట్స్ రేట్స్ విషయంలో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కు సినిమా ఎగ్జిబిటర్ కు మధ్య వచ్చిన లెక్కల తేడా వలన.. ఈ 1 AM షో ను ప్రస్తుతానికి హోల్డ్ చేసినట్లు సమాచారం. దీనితో ఉన్నట్లుండి థియేటర్ యాజమాన్యం ఈ షో ను క్యాన్సిల్ చేస్తున్నట్లు బోర్డు పెట్టారు.

అయితే.. తారక్ క్రేజ్ ను వాడుకుంటూ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి థియేటర్స్ యాజమాన్యం ఎక్కువ షేర్ అడిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దానికి డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోలేదని.. అందుకోసమే షో క్యాన్సిల్ చేశారని సమాచారం. ఉదయం నాలుగు గంటల నుంచి మాత్రం యధావిధిగా షోస్ రన్ అవుతాయని.. కేవలం ఒక్క 1 AM షో మాత్రమే క్యాన్సిల్ చేసారని చెబుతున్నారు. ఇక దేవర మూవీ విషయానికొస్తే.. ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ఎదురు చూసిన వారందరికీ కూడా.. మరికొద్ది గంటల్లో ఉపశమనం లభిస్తుందని చెప్పొచ్చు. మరి ఇప్పటివరకు సినిమాపై కొనసాగిం హైప్.. రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుందో చూడాలి. ఆకాశాన్ని అంటిన ప్రేక్షకుల అంచనాలను అక్కడే ఉంచుతాడా లేదా అని మరికాసేపట్లో తెలిసిపోతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş