iDreamPost
android-app
ios-app

OTT Suggestion: ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సస్పెన్స్ వెబ్ సిరీస్! స్టార్ట్ చేస్తే ఆపరు!

  • Published Apr 26, 2024 | 6:01 PM Updated Updated Apr 26, 2024 | 6:01 PM

ఇప్పుడు ఎక్కువగా ఎవరినైనా మీరు ఏ సిరీస్ చూస్తారని అడిగితే.. ఎనభై శాతం మంది చెప్పేది.. హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ గురించే. కానీ కొన్ని సార్లు అనేక కారణాల వలన ఆ సినిమాలను, సిరీస్ లను మిస్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు ఎక్కువగా ఎవరినైనా మీరు ఏ సిరీస్ చూస్తారని అడిగితే.. ఎనభై శాతం మంది చెప్పేది.. హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ గురించే. కానీ కొన్ని సార్లు అనేక కారణాల వలన ఆ సినిమాలను, సిరీస్ లను మిస్ చేస్తూ ఉంటారు.

  • Published Apr 26, 2024 | 6:01 PMUpdated Apr 26, 2024 | 6:01 PM
OTT Suggestion: ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్  సస్పెన్స్ వెబ్ సిరీస్! స్టార్ట్ చేస్తే ఆపరు!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో వందల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు వచ్చిపడుతున్నాయి. మరి దీనిలో ఏ సినిమా చూసామో.. ఏది చూడలేదు అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏ ఏ సినిమాలు, ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో.. ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా అప్ డేట్స్ వస్తున్నాయి. టుడే మూవీ రిలీజెస్ అంటూ.. వీకెండ్ రిమైండర్లు అంటూ ఇలా ఓటీటీ సినిమాలు, సిరీస్ లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. అయితే ఈ అప్ డేట్స్ ను చూస్తూ .. కొన్ని మంచి మూవీస్ ని మిస్ చేస్తున్నారు మూవీ లవర్స్. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా మీరు మిస్ చేసిన లిస్ట్ లో ఉందేమో.. ఓ లుక్ వేసేయండి. మరి ఇంతకీ ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు “కన్నమూచి”. ఇది 2020 లో వచ్చిన ఓ తమిళ వెబ్ సిరీస్.. కానీ ఇందులో లీడ్ రోల్ లో నటించిన నటి మాత్రం తెలుగు వారికి సుపరిచితురాలు. ఆ నటి మరెవరో కాదు.. పూర్ణ. తమిళ వెబ్ సిరీస్ కదా అని లైట్ తీసుకుంటే మాత్రం ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ చేసినట్లే. ఎందుకంటే ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ప్రస్తుతం జీ 5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే అందరికి ఇష్టమే. అదే ఒకే సిరీస్ లో అటు క్రైమ్ ను, ఇటు సస్పెన్స్ ను కవర్ చేస్తూ.. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ను ఇస్తే.. ఇంతకు మించి ఏం కావలి అనిపిస్తుంది. అందులోను అది వెబ్ సిరీస్ అయితే.. ప్రతి ఎపిసోడ్ కు మరింత ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. అటువంటి ఓ వెబ్ సిరీస్ ఏ ఇది కూడా.. ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ ను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం.. ఒక వర్త్ వాచింగ్ సిరీస్ ను మిస్ చేసినట్లే.

అసలు ఈ సిరీస్ ను ఎందుకు చూడాలి.. ఈ సిరీస్ కథేంటి అనే విషయానికొస్తే. పూర్ణ తన కూతురితో కలిసి ఒక కొత్త ఫ్లాట్ లోకి అద్దెకు దిగుతుంది. కానీ వచ్చిన కొద్దీ రోజులకే ఆ ఫ్లాట్ లో వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో ఆమె కూతురు కనిపించకుండా పోతుంది. ఆ పాపాను వెతికే క్రమంలో ఆమెకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి! ఆమె ఎలా వాటిని సాల్వ్ చేసింది ! చివరికి పాప దొరికిందా లేదా ! అనేది కథ. ఈ ప్రాసెస్ లో వచ్చే క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సీన్స్ గుండెల్లో వణుకు పుట్టిస్తాయని చెప్పి తీరాలి. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ సిరీస్ చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş