iDreamPost

వీడియో: యువతి ఆత్మహత్య.. ఆమె కోసం రాత్రంతా ఎదురు చూసిన శునకం!

వీడియో: యువతి ఆత్మహత్య.. ఆమె కోసం రాత్రంతా ఎదురు చూసిన శునకం!

శనకం అనేది విశ్వాసానికి ప్రతీక. అందుకే ఎవరైనా చేసిన సాయాన్ని మరిచిపోతే.. కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేకపోయా? అని అంటారు. తనను చేరదీసి పోషిస్తున్న యజమానికి ఇంటికి కాపలాగా ఉంటుంది. అలానే ఎవరైనా ఇంటికిపై, తన యజమానిపై దాడికి వస్తే.. వారి నుంచి కాపాడుతుంది. కుక్కకప ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే.. తన యజమాని కొంత క్షణం కనిపించకపోతేనే అల్లాడిపోతుంది. మరికొన్ని ఘటనల్లో తన యజమాని చనిపోయిన విషయం తెలియక రోజుల తరబడి వారికోసం రేయింబవళ్లు ఎదురు చూస్తుంయి. తాజాగా కన్నీళ్లు పెట్టించే  అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఓ యువతి నదిలోకి దూకి.. ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ విషయం తెలియని పెంపుడు కుక్క.. ఆ యువతి వదిలిన చెప్పుల వద్దనే రాత్రంత గడిపింది. అటుగా వెళ్లే వారు ఆ కుక్కను చూసి.. చలించిపోయారు. యానంలోని ఫెర్రీ రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మందాకి కాంచన అనే 22 ఏళ్ల యువతి ఆదివారం నదిలో దూకి ఆత్మహత్య  చేసుకుంది.  ఆదివారం యానంలోని గౌతమీ గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జ్ పైకి కాంచన వెళ్లింది. అక్కడ తన చెప్పులు వదలి నదిలోకి దూకింది. ఆమె పెంపుడు శునకం ఇచ్చిన క్లూతో ఆత్మహత్య చేసుకున్న యువతి కాంచనగా గుర్తించారు యానాం పోలీసులు. కాంచన ఆత్మహత్య చేసుకున్న తరువాత.. రెండు రోజులుగా ఆమె కోసం పోలీసు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం కాంచన మృతదేహం గోదావరిలో  తేలడంతో పోలీసులకు గుర్తించారు.

ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక యువతి చనిపోయే సమయంలో తనతో పాటు వచ్చిన పెంపుడు కుక్క.. ఆమె చెప్పులు వద్దే తిరిగింది. ఆమె కోసం మధ్య మధ్యలో గోదావరి పైపు చూస్తూ.. ఆ శునకం గంటల ఎదురు చూసింది. తన యజమాని కోసం అక్కడి కూర్చుని ఉన్న శునకం ఆ బ్రిడ్జ్ పై వెళుతున్న ప్రయాణికులను ఆశ్చర్యానికి, ఆవేదనను గురి చేసింది. ఏది ఏమైనా తనను పెంచిన యువతి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఏం చేయాలో పాలు పోక అక్కడే ఉండి.. ధీనంగా బాధపడింది. పోలీసులకు సమాచారం ఇచ్చేలా చేసిన ఆ టామీకి స్థానికులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మరి.. కన్నీళ్లు తెప్పించే  ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి