iDreamPost

Kumari Aunty: కుమారి ఆంటీ క్రేజ్.! 20 లక్షల మందికి దారి చూపబోతుందా?

  • Published Feb 01, 2024 | 1:15 PMUpdated Feb 01, 2024 | 2:38 PM

ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి కుమారి ఆంటీ. కొన్ని విషయాల కారణంగా దెబ్బతిన్న ఆమె బిజినెస్ ను తిరిగి నిలబెట్టడానికి.. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంది. ఈ కారణంగా మిగిలిన 20లక్షల చిరు వ్యారస్తులకు కూడా ఈ విధంగా దారి దొరకనుందా!

ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి కుమారి ఆంటీ. కొన్ని విషయాల కారణంగా దెబ్బతిన్న ఆమె బిజినెస్ ను తిరిగి నిలబెట్టడానికి.. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంది. ఈ కారణంగా మిగిలిన 20లక్షల చిరు వ్యారస్తులకు కూడా ఈ విధంగా దారి దొరకనుందా!

  • Published Feb 01, 2024 | 1:15 PMUpdated Feb 01, 2024 | 2:38 PM
Kumari Aunty: కుమారి ఆంటీ క్రేజ్.! 20 లక్షల మందికి దారి చూపబోతుందా?

కుమారి ఆంటీ.. ఒక స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకునే సాధారణ మహిళ. కొంతకాలం క్రితం ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం ఈ పేరు.. ఆమె బిజినెస్ తెగ వైరల్ అయిపోతుంది. ఇంత వైరల్ అవుతోంది కదా అని ఆమె స్థాయి ఏమి ఒక్కసారిగా మారిపోలేదు. పోగా ఆమె బిజినెస్ కే ఇబ్బందులు తెచ్చి పెట్టింది. దీనితో ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరిగి ఆమె బిజినెస్ ను ఏర్పాటు చేసుకోవడానికి సరైన వసతులు కల్పిస్తుంది. ఇంత వైరల్ అయ్యి ఆమె గురించి.. అటు సోషల్ మీడియాలోను ఇటు సొసైటీలోను చర్చలు నడుస్తున్నాయని కాబట్టి.. ఆమెకు సహాయం చేయడానికి పలువురు సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు. మరి ఆమెలా ఇలా చిరు వ్యాపారాలు చేసుకునే సుమారు 20 లక్షల మంది పరిస్థితి ఏంటి! కుమారి ఆంటీకి ఇప్పుడున్న క్రేజ్ కారణంగా.. అధికారులకు మిగిలిన చిరు వ్యాపారస్తుల మీద కూడా దృష్టి మళ్లేలా చేస్తుందా! త్వరలో వారి రాతలు కూడా  మారనున్నాయా!

జీవనాదారం కోసం ఎంతో మంది రోడ్ పక్కన ఫుడ్ బిజినెస్ లు చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు వీరికి ఆదరణ అంతగా లేకపోయినా.. ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో.. ఈ ఫుడ్ బిజినెస్ లు బాగా ఫేమస్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఫుడ్ రీల్స్ చేస్తూ.. ఏ ఏరియాలో ఏ ఫుడ్ బావుంటుంది. వాటి ప్రైజ్ ఎలా ఉంది. ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ ను డిటైల్డ్ గా చెప్తూ.. రీల్స్ పోస్ట్ చేస్తున్నారు . దీనితో ఆయా ఫుడ్ స్టాల్స్ మరింత ఫేమస్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే రోడ్ సైడ్ తక్కువ మొత్తంలో క్వాలిటీ ఆహారాన్ని అందించే ఫుడ్ స్టాల్స్ ఎన్నో ఉంటాయి. అందులో ఒకటి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్. ఆమె రాయదుర్గం-మాదాపూర్ రోడ్డులో సుమారు పదేళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తుంది. ఆమె చక్కగా అందరిని పలకరించే విధానం, ఆమె దగ్గర లభించే రుచికరమైన ఆహరంతో.. అందుకోసం ఆమె తీసుకునే అమౌంట్ తో.. మొదట సోషల్ మీడియాలో నెగెటివ్ గా ట్రోల్ అయినా.. పోనుపోను నిజాల నిజాలు బయటకు వచ్చి ఆమెను బాగా ఫేమస్ చేసేశాయి.

20 lakh people benefit from Kumari Aunty

దీనితో ఆమె బిజినెస్ చేసే ప్రాంతమంతా విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. దానికారణంగా ఆమె బిజినెస్ క్లోజ్ అయ్యే పరిస్థితులు ఏర్పడడం.. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం సహాయం చేయడం.. ఇవన్నీ అందరికి తెలిసిందే. మరి ఆమెలా బిజినెస్ చేసుకునే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? వారికీ ఎవరు సహాయం చేస్తారు? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- FSSAI అంచనా ప్రకారం దాదాపు 20 లక్షలు. పబ్లిక్, ఆఫీసులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఫుడ్ స్టాల్స్ చాలా కనిపిస్తాయి. క్వాలిటీ విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు, అభ్యంతరాలూ ఉన్నా సరే.. చాలామంది వీటివైపు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి సహాయం చేయడానికి.. ఓ అడుగు ముందుకు వేసింది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఫుడ్ స్ట్రీట్స్ ను ఏర్పాటు చేయాలనుకుంది.

కాగా, సిటీల్లో ఇప్పటికే కొనసాగుతున్న ఒక్కో ఫుడ్ స్ట్రీట్ కు కోటి రూపాయిలు కేటాయిస్తామని చెప్పింది. దీనివల్ల మంచి ఆహారాన్ని అందించడానికి వీలు కలుగుతుందని చెప్పింది. మరి అలానే వీధి పక్కన ఇలా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ను నడిపే వారిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే.. వారికీ ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఇక మన దేశంలో కేవలం పానీ పూరీ మార్కెట్టే దాదాపు 6 వేల కోట్ల రూపాయిలు ఉంటుందనే అంచనా. కాబట్టి.. కుమారి ఆంటీకి సహాయం చేసినట్టే.. మిగిలిన వారికీ కూడా అవసరమైన సదుపాయాలు కల్పించడం వలన.. అటు నాణ్యమైన ఆహరం అందుతోంది, ఇటు ఎక్కువమందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. మరి కుమారి ఆంటీ క్రేజ్ ఎంతమంది చిరు వ్యాపారస్తుల రాతలు మారుస్తుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి