iDreamPost

రాజమౌళి సినిమాతో మహేష్ కి భారీ లాస్? కొలిక్కి రాని లెక్కల లాజిక్!

  • Published Mar 15, 2024 | 5:19 PMUpdated Mar 15, 2024 | 6:08 PM

మహేష్ బాబు, రాజమౌళి ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంబినేషన్. అయితే, ఈ సూపర్ స్టార్ అండ్ స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ మీద ఎన్ని హోప్స్ ఉన్నాయో.. మరోవైపు మహేష్ బాబు రెమ్యూనిరేషన్ మీద కూడా అంతే డిస్కషన్స్ జరుగుతున్నాయి.

మహేష్ బాబు, రాజమౌళి ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంబినేషన్. అయితే, ఈ సూపర్ స్టార్ అండ్ స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ మీద ఎన్ని హోప్స్ ఉన్నాయో.. మరోవైపు మహేష్ బాబు రెమ్యూనిరేషన్ మీద కూడా అంతే డిస్కషన్స్ జరుగుతున్నాయి.

  • Published Mar 15, 2024 | 5:19 PMUpdated Mar 15, 2024 | 6:08 PM
రాజమౌళి సినిమాతో మహేష్ కి భారీ లాస్? కొలిక్కి రాని లెక్కల లాజిక్!

గుంటూరు కారం సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ కొట్టేశాడు. ఈ గ్యాప్ లో దర్శకధీరుడు రాజమౌళి మహేష్ కోసం కథ రెడీ చేసేశారు. దీనితో.. మహేష్ ని స్క్రీన్ మీద ఇప్పట్లో చూసే అవకాశం లేదని ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి తనివితీరా మహేష్ ను గుంటూరు కారం సినిమాలో స్క్రీన్ మీద చూసుకుని.. లేట్ అవుతుందని తెలిసిన రాజమౌళి మహేష్ ల సూపర్ కాంబో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి, రాజమౌళి సినిమా అంటేనే ప్రీ ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు పిక్చర్ సాలిడ్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుందని అందరికి తెలిసిందే. ఎంత లేదన్న రాజమౌళి ఒక సినిమా తీయాలంటే.. కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. సో మహేష్ ఈ మూడు నాలుగు సంవత్సరాలు జక్కన్న తో లాక్ అయిపోవాల్సిందే. అయితే, ఇప్పుడు జరిగే డిస్కషన్స్ అన్ని కూడా మహేష్ రెమ్యూనిరేషన్ విషయంలోనే.

రాజమౌళి మహేష్ తో తీయబోయే సినిమాకు సుమారు 300 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని టాక్. కాబట్టి దానిలో మహా అయితే మహేష్ రెమ్యూనిరేషన్ ఒక 100 కోట్లు ఉంటుంది. దీనిని బట్టి చూస్తే .. మహేష్ మూడు నుంచి నాలుగు సంవత్సరాలు టైమ్ కేటాయించి.. కేవలం 100 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకోవడం అంటే.. ఖచ్చితంగా మహేష్ కెరీర్ లో ఇది భారీ లాస్ అనే అంటున్నారు. ఎందుకంటే మహేష్ ప్రతి సినిమాకు ప్రస్తుతం 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఈ మూడు నాలుగు సంవత్సరాలలో ఏడాదికి ఒక సినిమా తీసినా కనీసం 150 నుంచి 200 కోట్ల దాకా వర్క్ అవుట్ అవుతుంది. సినిమాలతో పాటు మహేష్ యాడ్స్ కూడా చేస్తుంటాడు కాబట్టి.. వాటి ద్వారా మరో 20 నుంచి 40 కోట్ల దాకా తీసుకుంటాడు. కానీ ఇప్పుడు రాజమౌళితో లాక్ అయిపోవడం వలన అటు వేరే మూవీస్ చేయడానికి లేదు.. ఇటు యాడ్స్ చేయడానికి లేదు. ఈ ప్రకారంగా చూస్తే మహేష్ రెమ్యూనిరేషన్ పరంగా మహేష్ లాస్ అయినట్టే అనే టాక్ నడుస్తోంది.

అయితే, మరోవైపు లాస్ మ్యాటర్ పక్కన పెడితే.. మహేష్ కు ఈ సినిమాతో వచ్చే ఇమేజ్ అంత ఇంత కాదు. ఇప్పటికే రాజమౌళికి సినిమాలకు పాన్ ఇండియా లెవెల్లో ఉండే గుర్తింపు గురించి తెలిసిందే. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో మార్క్ సెట్ చేశాడు జక్కన్న. ఇదే క్రమంలో మహేష్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని నిస్సందేహంగా చెప్పేయొచ్చు. కాబట్టి రెమ్యూనిరేషన్ పక్కన పెడితే మహేష్ ఇమేజ్ మాత్రం జక్కన్న సినీ హిస్టరీలో నిలిచిపోతుంది. ఈ రకంగా చూసుకుంటే మహేష్ బెనిఫిట్ పొందుతున్నట్లే. ఏదేమైనా ఈ ఇద్దరి స్టార్స్ కాంబినేషన్ మీద మాత్రం అందరికి హై ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయి. మరి, మహేష్ రెమ్యూనిరేషన్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి