iDreamPost

రామ్ గోపాల్ వ‌ర్మ పీఎం అవుతాడు. ప‌ది ల‌క్ష‌లు బెట్టింగ్, అస‌క్తిక‌రంగా దోచేవారెవ‌రురా మూవీ టీజ‌ర్.

ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు శివ‌నాగేశ్వ‌రావు రాసిన పాన్ గ్లోబ‌ల్ లిరిక‌ల్ వీడియో, వైర‌ల్ అయ్యింది. అందులో అయ‌జ్ ఘోష్ న‌టించారు. ఈ పాట‌ను మ‌నో, సున‌యన క‌ల‌సి పాడారు.

ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు శివ‌నాగేశ్వ‌రావు రాసిన పాన్ గ్లోబ‌ల్ లిరిక‌ల్ వీడియో, వైర‌ల్ అయ్యింది. అందులో అయ‌జ్ ఘోష్ న‌టించారు. ఈ పాట‌ను మ‌నో, సున‌యన క‌ల‌సి పాడారు.

రామ్ గోపాల్ వ‌ర్మ పీఎం అవుతాడు. ప‌ది ల‌క్ష‌లు బెట్టింగ్, అస‌క్తిక‌రంగా దోచేవారెవ‌రురా మూవీ టీజ‌ర్.

రామ్ గోపాల్ వ‌ర్మ పీఎం అవుతాడు. ప‌ది ల‌క్ష‌లు బెట్టింగ్ కాస్తున్న సీన్ తో టీజ‌ర్ మొద‌లైంది. టీజ‌ర్ మొత్తం రూ.500 నోటు చుట్టూనే తిరుగుతుంది. 500 నోటు కోస‌మే గోవాకు హీరో, హీరోయిన్లు వెళ్తారు. ఇంత‌కీ ఆ 500 రుపాయిల నోటు ప్ర‌త్యేక‌త ఏంటి? ఎందుకంత ఇంపార్టెంట్? ఆర్జీవీ మీద ఎందుకు బెట్టింగ్ కాశారు? టీజ‌ర్ చెప్పిన స్టోరీ ఇదే. టీజ‌ర్ లో బాగా తెలిసిన ముఖాలే ఉన్నాయి. హీరో మాత్రం కొత్త‌. ప్ర‌ముఖ గీత ర‌చయిత చైత‌న్య ప్ర‌సాద్ కుమారుడు ప్ర‌ణ‌వ‌ చంద్రను సీనియ‌ర్ డైరెక్ట‌ర్ శివ నాగేశ్వ‌రావు హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇంత‌కుముందు ప్ర‌ణ‌వ‌ చంద్ర‌, డైరెక్ష‌న్ విభాగంలో కొన్నిసినిమాల‌కు ప‌నిచేశాడు.

ఈ టీజ‌ర్ ని స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ట్విట్ట‌ర్లో లాంచ్ చేశారు. శివనాగేశ్వరరావు సినిమాల్లోని చమత్కారం, ప్రత్యేకమైన హాస్య శైలిని ఆస్వాదిస్తాను. ఆయన రాబోయే చిత్రం దోచేవారెవరురా టీజర్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంద‌ని అంటూ, డైరెక్ట‌ర్ కు, మొత్తం టీమ్‌కి రాజ‌మౌళి శుభాకాంక్షలు తెలిపారు.

స్టార్ కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్ అజ‌య్ గోష్, ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ ను పోషించారు. ఒక‌రోల్ లో స్టైలిష్ విల‌నిజాన్ని చూపిస్తే, మ‌రో రోల్ లో అమాయ‌కుడిలా క‌నిపిస్తున్నారు. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు శివ‌నాగేశ్వ‌రావు రాసిన పాన్ గ్లోబ‌ల్ లిరిక‌ల్ వీడియో, వైర‌ల్ అయ్యింది. అందులో అయ‌జ్ ఘోష్ న‌టించారు. ఈ పాట‌ను మ‌నో, సున‌యన క‌ల‌సి పాడారు.

ఈ సినిమాకు మ‌రో ఆక‌ర్ష‌ణ‌ మ‌ల‌యాళం స‌న్సేష‌న్ మాళ‌విక‌. బొమ్మ‌ల కొలువు, బిఎఫ్ హెచ్ , చూసిచూడంగానే సినిమాలతో కుర్రాళ్ల‌కు బాగా న‌చ్చేసిన‌ ఈ ఫేమినా మిస్ ఇండియా కేర‌ళ‌, టీజ‌ర్ లో గ్లామ‌ర్ గానే క‌నిపించింది.

ఇక సినిమాలో బిత్తిరి స‌త్తి పుల్ లెంగ్త్ రోల్ లో, ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్ పాత్ర‌ను పోషించారు.

దోచేవారెవ‌రురా సినిమాకు రోహిత్ వ‌ర్ధ‌న్ మ్యూజిక్ ను అందించారు. టీజ‌ర్ బీజీఎం మూడ్ కు త‌గ్గ‌ట్టుగానే సస్పెన్స్ గానే సాగింది.

ఐక్యూ క్రియేష‌న్స్ ప‌తాకం(IQ Creations )పై బొడ్డు కోటీశ్వ‌రరావు ఈ సినిమాను ఖ‌ర్చుకు రాజీప‌డ‌కుండా నిర్మించారు. విజువ‌ల్స్ చూస్తుంటే చాలా రిచ్ గా క‌నిపించాయి.

స‌స్పెన్స్ కామెడీ థ్రిల్ల‌ర్ గా వ‌స్తున్న ఈ సినిమాను కుటుంబ స‌మేతంగా చూడొచ్చునంటున్నారు డైరెక్ట‌ర్. శివ‌నాగేశ్వ‌రావు. ఆయ‌న‌ మార్క్ కామెడీ, ట్విస్ట్ లు ఉండ‌నున్నాయి. మ‌నీ, సిసింద్రీలాంటి, ప‌ట్టుకోండి చూద్దాంలాంటి క్లాసిక‌ల్ హిట్స్ నిచ్చిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్ శివ‌నాగేశ్వ‌రావు డైరెక్ష‌న్ వ‌చ్చిన లేటెస్ట్ మూవీ దోచేవారెవ‌రురా.

ప్ర‌స్తుత స‌మాజంలో ఎవ‌రైనా ఇంటినుంచి బైట‌కొస్తే చాలు మ‌న‌ల్ని ర‌క‌ర‌కాలుగా దోచుకొంటున్నారు. ఇంత‌కుముందు టార్గెట్ చేసి కొంద‌ర్ని దోచుకొనేవారు. ఇప్పుడు అలాకాదు. మ‌న‌మే ఓట్లేసి దోచుకొనేవాళ్ల‌ను ఎన్నుకొంటున్నామ‌న్నాం. అలాగ‌ని ఇది పొటిక‌ల్ మూవీ కాదు. అన్నిర‌కాల ఎమోష‌న్ తో , ఔట్ అండ్ ఔట్ కామెడీ థ్రిల్ల‌ర్ గానే సినిమాను తీర్చిదిద్దారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి