iDreamPost

పవన్ వల్ల ఆ నిర్మాతలు రూ. 250 కోట్లు నష్టపోవాల్సిందేనా..?

పవన్‌ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నా కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకునే ఉద్దేశ్యంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన హరి హర వీరమల్లు, ఓజీ మరియు ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. ఆ మూడు సినిమాలు కూడా అటు ఇటుగా సగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. అవి పూర్తి అయ్యేది ఎప్పుడో చూడాలి.

పవన్‌ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నా కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకునే ఉద్దేశ్యంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన హరి హర వీరమల్లు, ఓజీ మరియు ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. ఆ మూడు సినిమాలు కూడా అటు ఇటుగా సగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. అవి పూర్తి అయ్యేది ఎప్పుడో చూడాలి.

పవన్ వల్ల ఆ నిర్మాతలు రూ. 250 కోట్లు నష్టపోవాల్సిందేనా..?

పవన్ కళ్యాణ్‌ తో సినిమా చేస్తే నిర్మాత మినిమం లాభాలను తన ఖాతాలో వేసుకోవచ్చు. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నిర్మాతకు లాభాల పంట పండినట్లే అనడంలో సందేహం లేదు. కానీ అదే పవన్ కళ్యాణ్ తో సినిమాను మొదలు పెట్టిన ముగ్గురు నిర్మాతలు ఇప్పుడు జుట్టుపీక్కుంటూ ఉంటారు. ఆ ముగ్గురు ఎవరు అంటే ఏఎం రత్నం, మైత్రి మూవీ మేకర్స్‌ మరియు దానయ్య. ఈ ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమాలను మొదలు పెట్టారు. ఆ సినిమాలు పూర్తి అయ్యి విడుదల అయితే నిర్మాతలకు లాభాలు దక్కేవి.

కానీ మొదలు పెట్టిన సినిమాలు పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మూడు సినిమాలు కూడా దాదాపు సగం వరకు షూటింగ్‌ పూర్తి అయింది. నిర్మాతలు పవన్‌ కు పెద్ద మొత్తం లో పారితోషికం ఇవ్వడం తో పాటు మేకింగ్‌ కి కూడా భారీగా ఖర్చు చేశారు. మరి కొన్ని రోజుల తర్వాత అయినా పవన్‌ ఆ సినిమాలు పూర్తి చేస్తాడు అని కొందరు నమ్మకంతో ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఎప్పటికి ఆ సినిమాలు పూర్తి అయ్యేది క్లారిటీ లేదని కామెంట్స్ చేస్తున్నారు.

క్రిష్ దర్శకత్వం లో పవన్‌ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మొదలు పెట్టి చాలా కాలం అయింది. ఏఎం రత్నం తో చాలా కాలం క్రితం ఉన్న కమిట్‌మెంట్‌ కారణంగా పవన్ ఈ సినిమాను చేస్తున్నాడు. మెజార్టీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, కీలక సన్నివేశాలను దర్శకుడు క్రిష్ ఇప్పటికే షూట్‌ చేశాడు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసి సెట్స్ వేసిన విషయం తెల్సిందే. పీరియాడిక్ సినిమా అవ్వడం వల్ల ఓ రేంజ్ లో ఖర్చు చేశారు. దాదాపుగా వంద కోట్ల రూపాయలను ఖర్చు చేశారు అంటూ సమాచారం అందుతోంది.

ఇక ఓజీ సినిమా కోసం కూడా పవన్‌ డేట్లు ఇచ్చి కొన్నాళ్ల పాటు షూటింగ్‌ లో కూడా పాల్గొన్నాడు. దానయ్య భారీ మొత్తంలో పవన్ కు పారితోషికం ఇచ్చాడు. అదే సమయంలో సినిమాను పూణేతో పాటు పలు కీలక ప్రాంతాల్లో షూట్‌ చేయడంతో భారీగా ఖర్చు చేయడం జరిగింది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దానయ్య కూడా దాదాపుగా వంద కోట్లు ఖర్చు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఇక హరీష్ శంకర్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్‌ కళ్యాణ్ తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్ ను మొదలు పెట్టారు. వారు కూడా ఇప్పటి వరకు దాదాపుగా రూ.50 కోట్లు ఖర్చు చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ మూడు సినిమాల షూటింగ్ లను సమాంతరంగా చేస్తూ వచ్చిన పవన్ ఇప్పుడు రాజకీయాలతో బిజీ అయ్యాడు. మొన్నటి వరకు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడితో బిజీపీ కి మద్దతు ఇచ్చి పొత్తు లో భాగంగా పోటీ చేసిన విషయం తెల్సిందే. తెలంగాణ లో పవన్ ఎన్నికల ప్రచారం జరిగింది. ఇక ఏపీలో ఎన్నికల హడావుడి మొదలు అవ్వడానికి ఎక్కువ రోజుల సమయం లేదు.

కనుక పవన్ ఇప్పుడు సినిమాలు అంటూ కెమెరా ముందుకు వస్తే జనసేన కార్యకర్తల్లో అసహనం పెరిగే అవకాశం ఉంది. కనుక ఆ మూడు సినిమాల షూటింగ్స్ కూడా ఇప్పట్లో లేదనే చెప్పాలి. 2024 లో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తే ఆ సినిమాల పరిస్థితి ఏంటో అని కొందరిలో చర్చ మొదలైంది. ప్రస్తుతానికి అయితే ఆ నిర్మాతలు పెట్టిన రూ.250 కోట్లు గాల్లో ఉన్నాయి. అవి దిగేనా, పైకి వెళ్లేనా క్లారిటీ లేదు. పవన్‌ ఆ మూడు సినిమాలను అర్థాంతరంగా వదిలేయడంను మీరు ఎలా చూస్తారు..? పవన్‌ రాజకీయ భవిష్యత్తు, సినిమా భవిష్యత్తు పై మీ అభిప్రాయం ఏంటి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి