iDreamPost

Ayodhya: అయోధ్య అక్షింతలు మిగిలిపోయాయా? వాటిని ఏం చేయాలంటే!

  • Published Jan 24, 2024 | 12:19 PMUpdated Jan 24, 2024 | 12:19 PM

అయోధ్య రామ మందిర ప్రారంబోత్సవానికంటే ముందుగానే.. మీ ఇళ్లకు రామయ్య ఆశీర్వాదంగా పంపిన అక్షింతలు.. ఇంకా మిగిలిపోయాయ.. వాటిని ఏమి చేయాలి అనే సందేహంలో ఉన్న వారికోసం.. వేద పండితులు ఇలా సూచించారు.

అయోధ్య రామ మందిర ప్రారంబోత్సవానికంటే ముందుగానే.. మీ ఇళ్లకు రామయ్య ఆశీర్వాదంగా పంపిన అక్షింతలు.. ఇంకా మిగిలిపోయాయ.. వాటిని ఏమి చేయాలి అనే సందేహంలో ఉన్న వారికోసం.. వేద పండితులు ఇలా సూచించారు.

  • Published Jan 24, 2024 | 12:19 PMUpdated Jan 24, 2024 | 12:19 PM
Ayodhya: అయోధ్య అక్షింతలు మిగిలిపోయాయా? వాటిని ఏం చేయాలంటే!

అయోధ్య రామ మందిరంలో “బాలక్ రామ్” నామధేయంతో బాల రాముడు కొలువుదీరాడు. ఇకపై కలియుగంలో మరో త్రేతాయుగపు అంశం మొదలుకానుంది. రెండు రోజుల క్రితం యావత్ భారతదేశం రామ నామ జపంతో ఊగిపోయింది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అంటే చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఒక ముఖ్యమైన అధ్యాయంగా.. ఎంతో అందంగా తీర్చిదిద్దినట్లు ఆరోజున అయిన వారంతా రామయ్య సన్నిధిలో సందడి చేశారు. ఇక రామ ప్రతిష్టాపనకు ముందుగానే ఆ రామయ్య తండ్రి తన ఆశీర్వాదంగా.. అందరికి అక్షింతలు పంపించిన సంగతి తెలిసిందే. ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం రోజున అందరు.. భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి పూజ చేసి ఈ అక్షింతలను స్వీకరించారు. అయితే, ఇప్పుడు మిగిలిన ఆ అక్షింతలు ఏం చేయాలి అనే సందేహం అందరికి కలుగుతోంది. వాటిని ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడో త్రేతాయుగంలో అయోధ్యను విడిచిన రాముడు.. తిరిగి కలియుగంలో తన ఇంటికి చేరుకున్నాడు. ఇకపై కలియుగంలో కొత్త అధ్యాయం మొదలుకాబోతుందని.. యావత్ భారతదేశం విశ్వసిస్తుంది. కొన్ని శతాబ్దాల నమ్మకాల బలమే ఈరోజు అయోధ్యలో రామ మందిరాన్ని స్థాపించి.. ప్రపంచం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకునేలా చేసింది. ఇక ఇప్పడున్న భక్తుల నమ్మకమే రాబోయే తరాలను రామయ్య బాటనా నడపబోతుందని చెప్పడంలో.. ఎటువంటి సందేహం లేదు. అయితే, ఆ అయోధ్య రామయ్య ఆశీర్వాదంగా.. అందరి ఇళ్లకు చేరిన అక్షింతలు.. పూజ చేసిన తర్వాత మరికొన్ని మిగిలిపోయి ఉంటాయి. వాటిని ఏమి చేయాలి అనే సందిగ్ధంలో ఉన్నారు అందరు. అలాంటి వారికీ కొన్ని సందర్భాలలో అయోధ్య అక్షింతలు ఉపయోగించడం వలన.. రామయ్య ఆశీర్వాదం పొందవచ్చని.. వేద పండితులు తెలియజేశారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Online booking of Darshan passes is easier

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజున.. అందరు వారి ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి.. అయోధ్య రామయ్య ఆశీర్వాదంగా వచ్చిన అక్షింతలను పూజించి.. వారి తలపై వేసుకుని ఆ రాముల వారి కృపకు లోనయ్యారు. ఇలా అందరి ఇళ్లలో ఎన్నో కొన్ని అక్షింతలు మిగేలే ఉంటాయి. వాటిని కూడా ఇంట్లో ఉండే సాధారణ అక్షింతలతో కలిపి.. దేవుడి మందిరంలో కానీ.. డబ్బులు ఉండే బీరువాలో కానీ భద్రపరచాలి. వాటికీ ఎలాంటి దోషాలు తాకకుండా జాగ్రత్త పడాలి. ఇలా జాగ్రత్త తీసుకుంటూ రాబోయే రోజుల్లో జరిగే శుభకార్యాలలోను , పెద్దల ఆశీర్వాదం కోసం వచ్చే పిల్లలను ఆశీర్వదించడం కోసం, పుట్టిన రోజలు, పెళ్లి రోజులు ఇలా అనేక శుభకార్యాల సమయంలో.. ఆ అయోధ్య రామయ్య ఆశీర్వాదంగా వీటిని ఉపయోగించుకోవచ్చని.. ఇలా చేయడం వలన వారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయని వేద పండితులు తెలియజేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి