iDreamPost

పెళ్లై 3 నెలలకే విడాకులు..నటి షాకింగ్ కామెంట్స్ !

Actress Divya Agarwal: ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కొద్ది కాలానికే డైవర్స్ తీసుకుంటున్నారు. అయితే కొంతమంది జంట అన్యోన్యంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో విడిపోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తాయి. అలాంటి వార్తపై ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Actress Divya Agarwal: ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కొద్ది కాలానికే డైవర్స్ తీసుకుంటున్నారు. అయితే కొంతమంది జంట అన్యోన్యంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో విడిపోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తాయి. అలాంటి వార్తపై ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది.

పెళ్లై 3 నెలలకే విడాకులు..నటి షాకింగ్ కామెంట్స్ !

సినీ ఇండస్ట్రీలో చాలా వరకు తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఎక్కువ కనిపిస్తారు. చాలా కాలం పాటు రిలేషన్ షిప్ లో ఉండి తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు కొంత కాలానికే విడిపోతున్నారు. ఇటీవల కొంతమంది సెలబ్రెటీలు డైవర్స్ విషయాన్ని అధికారికంగా ప్రకటించి మరీ షాక్ ఇస్తున్నారు. ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి ఇండస్ట్రీలో సర్వసాధారణం అయ్యింది. ప్రముఖ నటి దిగ్య అగర్వాల్ తన భర్తలో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై దివ్య అగర్వాల్ సోషల్ మాద్యమం ద్వారా ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకు వస్తాయిరా బాబూ అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ నటి దివ్వ అగర్వాల్ తాజాగా డైవర్స్ రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘అసలు దీని గురించి మాట్లాడటం నాకు అనవసరం. నేను పెళ్లి ఫోటోలు మాత్రమే తొలగించానని వార్తలు రాస్తున్నారు. దానితో పాటు 2500 పోస్టులు కూడా డిలీట్ చేశాను.. వాటి గురించి ఎందుకు ప్రస్తావించరో నాకు అర్థం కావడం లేదు. మీడియా వారు వాటిలో నా పెళ్లికి సంబంధించిన ఫోటోలపైనే ఫోకస్ పెట్టారు. ఇదంతా చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఇదంతా చూస్తుంటే నేను ఒకటి మాత్రం బాగా గమనించాను. వారు నా నుంచి పిల్లలు లేదా విడాకులు కోరుకుంటున్నారా? అది మాత్రం అస్సలు జరగదు’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి నేను నా మొదటి ప్రొఫైల్ లో పిన్ చేసిన పోస్ట్ గురించే మాట్లాడుతున్నా.. ప్రతి మూవీ హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. దేవుడి దయవల్ల నా భర్త నా పక్కన హ్యాపీగా గురకపెట్టి నిద్రపోతున్నాడు’ అంటూ రాసుకొచ్చింది.

Actress divya devorce

ఇక దివ్య అగర్వాల్ మోడల్ గా కెరీర్ ప్రారంభించిది. పలు రియాల్టీ షోలో పాల్గొంది. బిగ్ బాస్ ఓటీటీ 1 విజేతగా నిలిచింది. దివ్య ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. 2015 లో ‘మిస్ నవీ ముంబై’ టైటిల్ గెల్చుకుంది. 2016 లో ఇండియన్ ప్రిన్సెస్ పోటీలో విజేతగా నిలిచింది. హర్రర్ నేపథ్యంలో వచ్చిన రాగిణి ఎంఎంఎస్ : రిటర్న్ 2 తో నటిగా కెరీర్ ప్రారంభించింది. దివ్య అగర్వాల్ నాలుగేళ్లు వరుణ్ సూద్ తో ప్రేమాయణం కొనసాగించింది. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారు. 2024 లో వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లై మూడు నెలలకే విడాకులు వార్తలపై కాస్త గట్టిగానే రిప్లే ఇచ్చింది బాలీవుడ్ భామ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి