iDreamPost

డిజాస్టర్ కాంబోగా మారిన జనసేన,బిజేపి పొత్తు – ఎందుకంటే ?

డిజాస్టర్ కాంబోగా మారిన జనసేన,బిజేపి పొత్తు – ఎందుకంటే ?

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో అడ్రస్ లేకుండా పోయిన జనసేన , బిజేపి పార్టీలు ఎన్నికల తరువాత రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా మారాలనే ఆలోచనతో సిద్దాంతాలను సైతం పక్కకు నెట్టి రాజకీయ అవసరాలకోసం ఒకరికొకరు చేతులు కలిపి పొత్తులు ఏర్పర్చుకున్నారు. గడిచిన ఎన్నికల్లో దెబ్బతిన్నా వచ్చే స్థానిక ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్ళి తమ సత్తా చాటుతాం అని ఆనాడే ఇరు పార్టీలు ఉమ్మడి ప్రకటన చేశారు. జాతీయ పార్టీ అండతో , పవన్ కళ్యాణ్ క్రేజ్ తో ఇక రాష్ట్రంలో ఇరు పార్టీలు తిరుగులేని శక్తిగా మారటం ఖాయం అని ఆ పార్టీల ఛోటా నాయకులు సభల్లో ప్రకటించుకుంటు వచ్చారు. ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికల రంగంలో జనసేన బీజేపి సత్తా చాటబోతోంది అని ఆ పార్టీ అభిమానులు అంచనాలు వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం కూటమి చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా కనిపిస్తుంది. నామినేషన్ల దగ్గరే కూటమి పూర్తిగా చతికిలపడింది.

స్థానిక ఎన్నికల నగార మోగగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు తమ బల నిరూపణకు సర్వ శక్తులను కూడగట్టి పోరుకు సిద్దమయ్యారు. కానీ రాష్ట్రంలో ప్రత్యామనాయంగా మారటానికే పొత్తు పెట్టుకున్నం అని ప్రకటించిన జనసేన భారతీయ జనతా పార్టీలు మాత్రం బల నిరూపణంలో ఆదిలోనే పూర్తిగా చతికిల పడ్డాయి. కనీసం స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి అభ్యర్ధులు కూడా దొరక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 వేలకు పైచిలుకు ఎం.పి.టి.సి స్థానాల్లో సగానికి పైగా స్థానాల్లో నామినేషన్లు వేయలేకపోయాయి. ఈ ఎన్నికల్లో కూడా కేవలం గెస్ట్ అప్పీయరెన్స్ కే ఇరు పార్టీలు పరిమితం అయ్యాయి.

Read Also : కరోనాపై ఏపీ అప్రమత్తత.. ఏ రాష్ట్రం చేయలేని పని చేసిన జగన్‌ సర్కార్‌..

రాష్ట్రవ్యాప్తంగా ఎం.పి.టి.సి స్థానాలకు దాదాపు 50వేల నామినేషన్లు దాఖలు అయితే అందులో జనసేన వాటా కేవలం 2వేలు స్థానాలు మాత్రమే ఉండడం చూస్తే జనసేన అభ్యర్ధులు దొరక్క ఎన్ని అవస్థలు పడిందో సామాన్యులకు సైతం అర్ధం అవుతుంది. పోని జాతియ పార్టీగా ఉండి జనసేనతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఏమైనా నామినేషన్లు దాఖలు చెసిందా అంటే కేవలం రాష్ట్రవ్యాప్తంగా 1800 నామినేషన్లు మాత్రమే వేయగలిగింది. ఇలా ఇరు పార్టీల తరుపున మొత్తం 9వేల పైచిలుకున్న స్థానాలకు గాను 4వేలు స్థానాలకు కూడా అభ్యర్ధులు దొరకక నామినేషన్లు వేయలేక పోయారు. ఇక నామినేషన్లు దాఖలు చేసిన ఈ రెండు వేలల్లో ఆఖరివరకు బరిలో ఎంతమంది నిలుస్తారో, అందులో ఎంతమంది అభ్యర్ధులు విజయం సాధిస్తారు అన్నది వేరే విషయం.

Read Also : ఆరేళ్ల ప్రయాణం.. జనసేనాని సింహావలోకనం

గత ఎన్నికల్లో జనసేన పార్టీ కామ్రేడ్లు, బహుజన పార్టీలతో పొత్తులో ఉన్నా, బిజేపి తో పొత్తు కుదుర్చుకున్న సందర్భంగా ఒంటరిగా వెళ్ళి దెబ్బతిన్నాం ఈ సారి బి.జే.పితో వెళ్ళి లోకల్ పోరులో అదరకొడతాం అని ఘనంగా ప్రకటించుకున్నారు, కాని చివరికి ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా అభ్యర్ధులు కూడా దొరక్క జనసేన బిజేపి పార్టిలు పూర్తిగా చతికిల పడ్డాయి. బి.జే.పి జనసేన పొత్తుతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయం గా మారతాం అని ఆశపడ్డ ఇరు పార్టీ కార్యకర్తలకు ఈ పరిణామాలతో మరోసారి నిరాశే మిగిలింది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ఇరు పార్టీల కలయక డిజాస్టర్ కాంబోగా వర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్తుంది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి