iDreamPost
android-app
ios-app

Spirit Movie: స్పిరిట్ టార్గెట్ వెయ్యి కోట్లు

  • Published Mar 03, 2024 | 2:37 PM Updated Updated Mar 03, 2024 | 2:37 PM

డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా , రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ విషయం బయటకి వచ్చింది.

డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా , రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ విషయం బయటకి వచ్చింది.

  • Published Mar 03, 2024 | 2:37 PMUpdated Mar 03, 2024 | 2:37 PM
Spirit Movie: స్పిరిట్ టార్గెట్ వెయ్యి కోట్లు

డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా – రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచే అటు ప్రభాస్ అభిమానుల్లో ఇటు ఇతర ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన “గామి” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన తదుపరి ప్రాజెక్ట్ “స్పిరిట్” గురించి మంచి అప్ డేట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేశారు.

2024 చివర్లో ‘స్పిరిట్’ చిత్రీకరణ ప్రారంభం కానుందని, ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ కాప్ గా కనిపిస్తారని వంగా వెల్లడించడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల మీద కూడా ట్రేడ్ పండితులు అప్పుడే టార్గెట్ కూడా ఫిక్స్ చేశారు. సందీప్ వంగా తొలి చిత్రం “అర్జున్ రెడ్డి” 50 కోట్ల గ్రాస్ వసూలు చేయగా… దాని రీమేక్ “కబీర్ సింగ్” 350 కోట్లు దాటింది. ఇక రణబీర్ కపూర్ తో తీసిన “యానిమల్” ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్లు వసూలు చేయడంతో సహజంగానే “స్పిరిట్” కలెక్షన్స్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశం గట్టిగానే ఉందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే గనక జరిగితే సందీప్ రెడ్డి వంగాకి తొలి వెయ్యి కోట్ల గ్రాసర్  స్పిరిట్ మూవీనే అవుతుంది.

ఇంతకు ముందు ‘బాహుబలి 2’ (2017) సినిమాతో ప్రభాస్ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశారు. ఇక ప్రభాస్ నుండి ఈ వేసవిలో రాబోయే మరో భారీ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’ చిత్రం కూడా 1000 కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఉండగా, ‘స్పిరిట్’ కూడా అంచనాలను అందుకోగలిగితే రెబల్ స్టార్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. వంగా అంటేనే అగ్రెసివ్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరు. అలాంటి పాత్రలోనే తమ అభిమాన హీరోని చూడాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి స్పిరిట్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగక తప్పదు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisJojobetHoliganbetJojobet GirişJojobet - Güncel Giriş Adresi, Bonus ve Üyelik 2026