iDreamPost

Kalki 2898 AD: ‘కల్కి’లో సరికొత్త ప్రభాస్ ను, ఇండియాను చూస్తారు: నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 2898 AD పెట్టడానికి ఓ రీజన్ ఉందని, ప్రభాస్ ను, ఇండియాను ఇంతకు ముందు చూడని విధంగా మీరు ఈ చిత్రంలో చూస్తారని చెప్పుకొచ్చాడు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 2898 AD పెట్టడానికి ఓ రీజన్ ఉందని, ప్రభాస్ ను, ఇండియాను ఇంతకు ముందు చూడని విధంగా మీరు ఈ చిత్రంలో చూస్తారని చెప్పుకొచ్చాడు.

Kalki 2898 AD: ‘కల్కి’లో సరికొత్త ప్రభాస్ ను, ఇండియాను చూస్తారు: నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘కల్కి 2898 AD’.. హాలీవుడ్ రేంజ్ మేకోవర్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోణె లాంటి భారీ కాస్టింగ్ తో.. అంతే భారీగా తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ గా కల్కి తెరకెక్కుతోంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 2898 AD పెట్టడానికి ఓ రీజన్ ఉందని, ప్రభాస్ ను, ఇండియాను ఇంతకు ముందు చూడని విధంగా మీరు ఈ చిత్రంలో చూస్తారని చెప్పుకొచ్చాడు.

‘కల్కి 2898 AD’.. 2023 శాన్ డియాగో కామిక్-కాన్ లో ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిందే. ఈ గ్లింప్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాడని అందరూ ప్రశంసించారు. దీంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. పైగా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్ కాస్టింగ్ ఉండటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. మరోసారి కల్కిని వార్తల్లో నిలిచేలా చేశాడు నాగ్ అశ్విన్. తాజాగా ఐఐటీ బాంబేలో జరిగిన ‘టెక్ ఫెస్ట్ 23’లో కల్కి మూవీ ప్రత్యేక కంటెంట్ ను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఆ తర్వాత జరిగిన Q & Aలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..”కల్కి చాలా డిఫరెంట్ మూవీ. ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదనే చెప్పాలి. ఒక ప్రత్యేక ప్రపంచంలో ఈ కథ జరుగుతుంది. ఇందుకోసం ఓ న్యూ వరల్డ్ నే సృష్టించాం. కల్కిలో మీరు సరికొత్త ఇండియాతో పాటుగా సరికొత్త ప్రభాస్ ను చూస్తారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రతీ విషయంలో ఎంతో శ్రద్ద తీసుకుని నిర్మిస్తున్నాం. ఇందులో కనిపించే ఆయుధాలు, కాన్సెప్ట్స్, క్యాస్ట్యూమ్స్ ప్రతీది భారతీయ మూలాలతో ముడిపడి ఉంటాయి. అమితాబ్, కమల్, దీపిక పాత్రలు అభిమానులు అలరిస్తాయి” అని చెప్పుకొచ్చాడు. ఇక కల్కికి 2898 ఏడీ అని పెట్టడానికి ఓ రీజన్ ఉందని, ఆ సీక్రెట్ ను సినిమా విడుదల దగ్గర పడుతున్న టైమ్ లో చెబుతాను అంటూ నవ్వుతూ చెప్పాడు నాగ్ అశ్విన్. నాగీ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారా? అని అడగ్గా.. లేదంటూ ఆన్సర్ ఇచ్చాడు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని, 93 రోజుల తర్వాత ట్రైలర్ విడుదల ఉండొచ్చని చెప్పి నవ్వులు పూయించాడు డైరెక్టర్ సాబ్. మరి కల్కి మూవీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి