iDreamPost

Dil Raju: వీడియో: ఆకట్టుకుంటున్న దిల్ రాజు కొడుకు బర్త్ డే సాంగ్..

Dil Raju: వీడియో: ఆకట్టుకుంటున్న దిల్ రాజు కొడుకు బర్త్ డే సాంగ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. దేశంలోనే బడా సినిమా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ ఆయన పెద్దపెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమలు అందిచారు. ఇలా ఓ సక్సెస్ ఫుల్ నిర్మాతగా దిల్ రాజు కొనసాగుతున్నారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే… దిల్ రాజుకు గతేడాది బాబు అన్వై రెడ్డి పుట్టాడు. ఇటీవలే అన్వై రెడ్డి తొలి పుట్టినరోజును ఘనంగా నిర్వహించాడు. అన్వై రెడ్డి తొలి పుట్టినరోజు వేడుకు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే తాజాగా తన కుమారుడి బర్త్ డే సాంగ్ ను దిల్ రాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అందరిని తెగ ఆకట్టుకుంటుంది.

దిల్‌రాజు మూడేళ్ల క్రితం తేజస్విని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి గతేడాది అన్వై  అనే కుమారుడు జన్మించారు. తాజాగా గురువారం దిల్‌రాజు కుమారుడి మొదటి పుట్టిన రోజు గ్రాండ్‌గా నిర్వహించారు. దీని కోసం టాలీవుడ్‌లో అందరిని ఆహ్వానించారు. దీంతో భారీగా తారలు తరలివచ్చి.. దిల్ రాజు కొడుకును ఆశీర్వదించారు. ఇక టాలీవుడ్ నుంచి దాదాపు అందరు హీరోలు, ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ఇదిలా సెలబ్రేషన్స్ తరవాత మీడియాకు దిల్ రాజు ఓ సాంగ్ విడుదల చేస్తారు. దిల్ రాజు.. తన కుటుంబ సభ్యులతో కలిసి అన్వై పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు.

దీనికి సంబంధించి ఓ సాంగ్ ను క్రియేట్ చేశారు. దీనికి తమన్ మ్యూజిక్ అందించగా.. కార్తీక్ పాడారు. ఈ వీడియోలు దిల్ రాజు కుమారుడు చేసిన రచ్చ మాములుగా లేదు. అలానే దిల్ రాజు దంపతులు.. కుమారుడినితో తెగ ఎంజాయ్ చేశారు. కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు అన్వై రెడ్డిని ఎత్తుకుని  తెగ ఆడించారు. ఇలా దిల్ రాజు కుటుంబ సభ్యుల సందడికి తమన్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. అలానే కార్తిక్ అందించిన గాత్రం.. అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే స్టార్ హీరోలో ఫ్యాన్స్ కూడా దిల్ కుమారుడికి బర్త్ డే విషెష్ చెప్తున్నారు. మరి.. ఈ వీడియోను వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి