iDreamPost

జగన్ కు చంద్రబాబుకు తేడా ఏమిటో తెలిసిందా ?

జగన్ కు చంద్రబాబుకు తేడా ఏమిటో తెలిసిందా ?

చంద్రబాబునాయుడు హయాంలో ప్రతిదీ ఓ మెగా ఈవెంటులాగానే జరిగేది. ప్రతి ఈవెంటును ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్ధకు అప్పగించి కోట్ల రూపాయలు తగలేసేవాడు. శంకుస్ధాపన కార్యక్రమాన్ని ఎన్ని రకాలుగా ? ఎంతమంది కేంద్రమంత్రులను పలిపించి భారీ కార్యక్రమాలు నిర్వహించాడో అందరూ చూసిందే. హుద్ హూద్ తుపాను, తిత్లీ తుపాను బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించాడు. చెక్కులు పంపిణీ చేయించేటపుడు శ్రీకాకుళంలో భారీ బహిరంగసభ నిర్వహించి హోర్డింగులతో హోరెత్తించాడు.

సీన్ కట్ చేస్తే గ్యాస్ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు జగన్ ఇచ్చిన నష్టపరిహారం తలా కోటి రూపాయలు. వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్న బాధితుల కుటుంబాలకు తలా పది లక్షల రూపాయలు. సరే ఇంకా ఇతర క్యాటగిరీలు కూడా ఉన్నాయి. చంద్రబాబు పంపిణి చేసిన 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలకే భారీ బహిరంగసభలు పెడితే జగన్ ఇచ్చిన కోటి రూపాయలకు ఇంకేస్ధాయిలో బహిరంగ సభ నిర్వహించాలి ?

కానీ ఇక్కడ చెక్కులు పంపిణి చేసిందెవరయ్యా అంటే జగన్ కాదు మంత్రులే పంపిణి చేసేశారు. బహిరంగ సభ కాదు కదా కనీసం ఓ కార్యక్రమం కూడా లేదు. మంత్రులే బాధితుల ఇళ్ళకు వెళ్ళి చెక్కులను అందించేశారు. ఇక ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అవుతున్న బాధితులకు అందాల్సిన చెక్కులను మంగళవారం నుండి వాలంటీర్లే పంపిణి చేసేస్తారు. అందుకు కావాల్సిన బ్యాంకుల్లో ఖాతాలు తెరవటం లాంటి సహాయం లాంటి వాటి మొత్తాన్ని వాలంటీర్లనే చేయమని జగన్ ఆదేశించాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నష్టపరిహారాన్ని ప్రకటించటం మాత్రమే జగన్ చేశాడు. మిగిలిన కార్యక్రమాల్లో ఎక్కడా జగన్ కనబడలేదు. టిడిపి అధికారంలో ఉన్నపుడు ప్రతి చిన్న విషయంలోను చంద్రబాబే ముందుండే వాడు. ఎందుకనంటే అంతగా ప్రచార కక్కుర్తి ఉండేది. తనకు తప్ప మరొకరికి ప్రచారం రాకూడదని, మీడియాలో హైలైట్ కాకూడదనే పిచ్చి. ఆ ప్రచార పిచ్చే చివరకు టిడిపి కొంప ముంచేసింది మొన్నటి ఎన్నికల్లో. అయినా ఇంకా చంద్రబాబుకు బుద్ధి వచ్చినట్లు లేదు. ఎందుకంటే జగన్ కు ఎక్కడ కూడా పాజిటివ్ ఇమేజి రాకుండా ఎల్లోమీడియాతో బురద చల్లిస్తున్నాడు. సరే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జగన్, చంద్రబాబుల మధ్య జనాలు తేడాను గ్రహించేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి