iDreamPost

అమెరికా మాస్కులను హైజాక్ చేసిందా ?

అమెరికా  మాస్కులను హైజాక్ చేసిందా ?

ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతుంటే అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికా మాత్రం నైతిక విలువలను కోల్పోయిందా ? ఒక దేశానికి వెళ్ళాల్సిన వైద్య సామగ్రిని హైజాక్ చేసి తాను ఎత్తుకెళ్ళిపోయిందా ? అంటే అవుననే అంటున్నారు అందరు. ఇంతకీ విషయం ఏమిటంటే చైనాలోని షాంగై విమానాశ్రయంలోని విమానంలో నుండి ఫ్రాన్స్ కు వెళ్ళాల్సిన లక్షలాది బాక్సుల మాస్కులు దారిమళ్ళి అమెరికాకు వెళ్ళిపోయింది. దీంతో ఫ్రాన్స్ దేశ ప్రధాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారం రేగుతోంది.

ఇంతకీ జరిగిందేమిటంటే కరోనా వైరస్ దెబ్బకు అమెరికాలోనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం మీద కూడా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు, మాస్కులు, సూట్లు అందుబాటులో లేవన్నది వాస్తవం. దానికోసం చాలా దేశాలు చైనా మీదే ఆధార పడ్డాయి. దాంతో చైనాలో సమస్య తీవ్ర తగ్గటంతో వెంటనే ఆయా దేశాల అవసరాల కోసం చైనాకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్రాన్స్ కూడా మాస్కుల కోసం ఆర్డర్ ఇచ్చింది.

ఆర్డర్ రెడీ అయి కార్గొ విమానంలో ఫ్రాన్స్ వెళ్ళటానికి విమానంలోకి మొత్తం సరుకును ఎక్కించారు. ఈ సమయంలో హఠాత్తుగా నలుగురు వ్యక్తులు విమానంలోని వ్యక్తులతో మాట్లాడారట. వాళ్ళ మాటలు వినకపోతే ఒత్తిడి పెట్టారట. చివరకు అమెరికాలోని ఉన్నతాధికారులతో చైనా ఉన్నతాధికారులతో మాట్లాడించారట. చైనా వాళ్ళు ఫ్రాన్స్ లో కన్నా అమెరికాలోనే ఎక్కువ మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారట. ఫ్రాన్స్ ఇస్తానన్న డబ్బులకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఇస్తానని ప్రలోభాలు పెట్టి మొత్తానికి సరుకునంతా అమెరికాకు తీసుకెళ్ళిపోయారట.

ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో వెంటనే ఫ్రాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందట. ప్రాణాలంటే అమెరికన్లవి మాత్రమేనా మిగితా దేశాలవి కావా ? అంటూ నిలదీశారు. సరే ఫ్రాన్స్ ఆరోపణలను అమెరికా కొట్టిపారేస్తోందనుకోండి అది వేరే సంగతి. ఇదే సమయంలో బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి హెన్నీ లూయిక్ మాట్లాడుతూ మాస్కులు, ఇతర వైద్య ఉపకరణాల కోసం చైనాకు అమెరికా 23 పెద్ద కార్గొ విమానాలను పంపిన మాట వాస్తవమే అన్నారు. తమకు రావాల్సిన వైద్య ఉపకరణాలు కూడా బ్రెజిల్, చెక్ రిపబ్లిక్ దేశాలు మండి పడుతున్నాయి. మొత్తం మీద అవసరం కోసం అమెరికా ఎంత నీచానికైనా దిగజారుతుందని రుజువైపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి