iDreamPost

కుల్దీప్ లెఫ్ట్ హ్యాండ్ షేన్ వార్న్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర కామెంట్స్!

టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. కుల్దీప్ ను ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ తో పోల్చుతూ.. పొగడ్తలు కురిపించాడు.

టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. కుల్దీప్ ను ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ తో పోల్చుతూ.. పొగడ్తలు కురిపించాడు.

కుల్దీప్ లెఫ్ట్ హ్యాండ్ షేన్ వార్న్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర కామెంట్స్!

రాంచీ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత యువ క్రికెటర్లు సత్తాచాటడంతో.. సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. ఇక కీలకమైన ఈపోరులో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో దుమ్మురేపిన కుల్దీప్.. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. అతడ్ని ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ తో పోల్చాడు.

కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్ లో టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో వికెట్లేమీ తీయకపోయినా.. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని తక్కువ స్కోర్ కే పరిమితిచేయడంలో విజయం సాధించాడు. ఇక దీనికి మించి తొలి ఇన్నింగ్స్ లో అతడి బ్యాటింగ్ నభూతో నభవిష్యతి. టీమిండియా వికెట్లు కోల్పోతున్న దశలో ఏకంగా 131 బంతులు ఎదుర్కొని కీలకమైన 28 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గించాడు. ఇక ఈ మ్యాచ్ లో కుల్దీప్ ప్రదర్శనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ పొగడ్తల వర్షం కురిపించాడు. కుల్దీప్ ను దివంగత ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తో పోల్చాడు.

మైఖేల్ వాన్ మాట్లాడుతూ..”కుల్దీప్ ఈ మ్యాచ్ లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అతడి బౌలింగ్ చూస్తుంటే.. షేన్ వార్న్ ఎడమచేతితో బౌలింగ్ వేస్తున్నాడా? అని అనిపించింది. గింగిరాలు తిరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. ఇలాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు” అంటూ కుల్దీప్ పై ప్రశంసలు కురింపించాడు. ప్రస్తుతం మైఖేల్ వాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి కుల్దీప్ ను షేన్ వార్న్ తో పోల్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. తొలి మ్యాచ్ లోనే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి