iDreamPost
android-app
ios-app

ధనుష్ ని మరో తెలుగు డైరెక్టర్ లాక్ చేసుకున్నాడా..?

  • Author ajaykrishna Published - 02:43 PM, Wed - 9 August 23
  • Author ajaykrishna Published - 02:43 PM, Wed - 9 August 23
ధనుష్ ని మరో తెలుగు డైరెక్టర్ లాక్ చేసుకున్నాడా..?

ఇండియాలో ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేషనల్ అవార్డు విన్నర్ గా ధనుష్ పెర్ఫార్మన్స్ ఏంటనేది అందరికీ తెలుసు. ఇటీవల కెప్టెన్ మిల్లర్ మూవీతో ధనుష్ తన 50 సినిమాల మార్క్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ధనుష్ కెరీర్ కెప్టెన్ మిల్లర్ మోర్ స్పెషల్ ఫిల్మ్ కాబోతుంది. అయితే.. ధనుష్ ఓవైపు తమిళ, హిందీ సినిమాలను లైనప్ చేస్తూనే.. తెలుగు డైరెక్టర్స్ తో కూడా సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ ఏడాది తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో.. సార్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తెలుగులో ఆ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. ఇటీవల వీరి సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం వెలువడింది. ఆ సినిమా పీరియడిక్ జానర్ లో తెరకెక్కనుంది. ఏసియన్ ఫిలిమ్స్ వారు భారీ స్థాయిలో శేఖర్ కమ్ముల సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. ధనుష్ తో పాటు ఓ సీనియర్ హీరో కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ధనుష్ సొంత దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేశాడు. ఇవన్నీ లైన్ లో ఉండగానే ధనుష్ మరో టాలీవుడ్ డైరెక్టర్ కి ఓకే చెప్పినట్లు టాక్.

ఇంతకీ ఆ తెలుగు డైరెక్టర్ ఎవరో కాదు.. నీది నాది ఒకే కథ, విరాటపర్వం లాంటి సినిమాలు తెరకెక్కించిన వేణు ఊడుగుల. ఇప్పటిదాకా చేసింది రెండు సినిమాలే అయినా.. వేణుకు డైరెక్టర్ గా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం వేణు తన మూడో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కాగా.. రీసెంట్ గా ధనుష్ ని కలిసి ఓ కథ చెప్పాడట. ఆ కథ ధనుష్ కి కూడా నచ్చడంతో లాక్ చేసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ప్రొడ్యూస్ చేస్తారని వినికిడి. ఇక త్వరలోనే వీరి కాంబినేషన్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈసారి వేణు ఎలాంటి లైన్ రెడీ చేసాడో.. మరి ధనుష్ – వేణు ఊడుగుల కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet