iDreamPost

క్రెడిట్ కార్డు తీసుకుని కూడా వాడకపోతే కలిగే నష్టాలివే!

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులేని బ్యాంకు ఖాతాదారులు చాలా తక్కువ మంది ఉంటారనే చెప్పాలి. ఎందుకంటే బ్యాంకుల వాళ్లే వెంటబడి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు తీసుకుని వాడకపోతే కలిగే నష్టాలు ఏంటో తెలుసుకోండి.

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులేని బ్యాంకు ఖాతాదారులు చాలా తక్కువ మంది ఉంటారనే చెప్పాలి. ఎందుకంటే బ్యాంకుల వాళ్లే వెంటబడి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు తీసుకుని వాడకపోతే కలిగే నష్టాలు ఏంటో తెలుసుకోండి.

క్రెడిట్ కార్డు తీసుకుని కూడా వాడకపోతే కలిగే నష్టాలివే!

ప్రస్తుతం క్రెడిట్ కార్డు అనేది అందరికీ అందుబాటులో ఉంది. నిజానికి అందరూ కనీసం ఒక క్రెడిట్ కార్డు కలిగి ఉంటున్నారు. చాలా మంది అయితే నాలుగైదు రకాల క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నారు. క్రెడిట్ కార్డు ఇష్యూ చేయడం కూడా చాలా సులభతరం అయిపోయింది. బ్యాంకు వాళ్లే ఫోన్ చేసి క్రెడిట్ కార్డు తీసుకునే వరకు విసిగించేస్తుంటారు. వాళ్ల ఫోన్ కాల్స్ తట్టుకోలేక కూడా చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇస్తున్నారు కదా అని తీసుకుని పక్కన పెట్టేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు తీసుకుని వాడకపోతే మీరు నష్టపోతారు అనే విషయం మీకు తెలుసా? క్రెడిట్ కార్డు తీసుకుని వాడకపోతే కలిగే నష్టాలేంటో చూద్దాం.

లిమిట్ పెరగదు:

క్రెడిట్ కార్డుని మీరు వాడుతూ ఉంటే దాని లిమిట్ పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా క్రెడిట్ కార్డును చాలా తక్కువ రుణ పరిమితితో ఇస్తారు. కానీ, మీ రుణ పరిమితిని పెంచుకోవడం చాలా సులభం. దానికి మీరు చేయాల్సిందల్లా క్రెడిట్ కార్డుని వాడుతూ ఉండటమే. అలా చేస్తే.. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఆటోమేటిక్ గా పెంచుకోవచ్చు. కానీ, మీరు కార్డు వాడకపోతే ఆ లిమిట్ అలాగే ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో వాడాల్సి వచ్చినా కూడా మీకు కార్డు ఉపయోగపడకుండా పోతుంది.

క్రెడిట్ స్కోర్ పెరగదు:

సాధారణంగా మీ క్రెడిట్ స్కోర్ పెరగడం మీ ఆర్థిక లావాదేవీలపై ఆధారపడి ఉంటుంది. నార్మల్ ట్రాన్సాక్షన్స్ తో మీరు మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవడం కష్టంగా మారుతుంది. కానీ, క్రెడిట్ కార్డు వాడే వారికి క్రెడిట్ స్కోర్ చాలా తేలికగా పెరుగుతుంది. క్రెడిట్ కార్డుని సరిగ్గా వాడుతూ.. టైమ్ లోపు బిల్స్ కడుతూ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే రుణాలు కూడా చాలా తేలికగా వస్తాయి. మీకు క్రెడిట్ కార్డు ఉండికూడా వాడకుండా ఉంటే.. ఉన్న అవకాశాన్ని మీరు చేజార్చుకున్న వాళ్లు అవుతారు.

సమయానికి యూజ్ కాదు:

క్రెడిట్ కార్డు వారిలో చాలా మంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. ఎప్పుడో ఏదో అవసరం వస్తుంది అని.. ఇప్పటి నుంచే కార్డు వాడటం మానేస్తారు. ఎప్పుడన్నా ఎక్కువ మొత్తంలో అవసరం వస్తే ఎలా అంటూ క్రెడిట్ కార్డుని వాడటం మానేస్తారు. కానీ, అలా చేయడం వల్లే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి వాడని క్రెడిట్ కార్డుని బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీకు అత్యవసరంగా కావాలి అని అప్పుడు కార్డు వాడాలి అనుకున్నా కూడా అప్పుడు అక్కరకు రాకుండా పోతుంది.

రివార్డులు కోల్పోతారు:

మీరు డెబిట్ కార్డుని ఎంత వాడినా, యూపీఐ చెల్లింపులు ఎన్ని చేసినా కూడా మీకు రివార్డ్స్ రావు. కానీ, క్రెడిట్ కార్డుని వాడటం ద్వారా మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. తర్వాత వాటిని రెడీమ్ చేసుకోవచ్చు. కొందరికి పెట్రోలియం కార్డులు ఉంటాయి. ఆ క్రెడిట్ కార్డుని వాడుతూ ఉండటం వల్ల.. రివార్డు పాయింట్లతో ఫ్రీగా ఫ్యూయల్ కూడా పొందవచ్చు. అదే మీరు క్రెడిట్ కార్డు ఉండి కూడా వాడకపోతే.. ఇలాంటి రివార్డు పాయింట్లను కచ్చితంగా మిస్ చేసుకున్నవాళ్లు అవుతారు. అయితే క్రెడిట్ కార్డు తీసుకునే ముందే మీరు బాగా ఆలోచించుకోవాలి. మీకు అది ఉపయోగపడుతుందా? లేదా అని. తీసుకున్న వాడకపోతే మాత్రం మీరు తప్పకుండా నష్టపోతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి