iDreamPost

మెట్రోలో రెచ్చిపోయిన మరో ప్రేమ జంట.. వీడియో వైరల్

మెట్రోలో రెచ్చిపోయిన మరో ప్రేమ జంట.. వీడియో వైరల్

దేశ వ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ మాత్రం తరుచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. సీటు కోసం ఘర్షణలు, చిత్ర విచిత్రమైన విన్యాసాలు, బోగీలోనే రీల్స్ చేయడం, విచ్చలవిడి రోమాన్స్‌లు, హగ్గులు, ముద్దులు ఒక్కటేమిటి కొంతమంది లవర్స్ మెట్రో రైల్ ని తమ సొంత ప్రాపర్టీగా భావిస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే పదిమంది చూస్తున్నారన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ఆడామగ సిగ్గూ..ఏగ్గూ లేకుండా తెగబడుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోలో ప్రేమ జంట రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో మెట్రోలో వరుసగా అసభ్యకరమైన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఆనంద్ విహార్ మెట్రో రైల్ లో డోర్ వద్ద ఓ జంట ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించుకున్నారు. తోటి ప్రయాణికులు ఉన్నారన్న ద్యాస కూడా లేకుండా తమదైన రొమాంటిక్ లోకంలో విహరించారు. పదే పదే ముద్దులు పెట్టుకుంటూ నానా యాగీ చేశారు. ఈ సంఘటనలో పక్కన ఉన్న తోటి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఓ నెటిజన్ ‘ఆనంద్ విహార్ స్టేషన్ లో ఓ ఉద్వేగభరిత వీడియో.. ప్రేమ గుడ్డిది, ప్రజల అవసరం మనకు లేదు అని భావించి ఉంటారు’ అంటూ క్యాప్షన్ పెట్టి ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, తోటి ప్రయాణికులు మండిపడుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మెట్రో కార్పోరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు. మెట్రో ట్రైన్ లలో ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయని.. ఆ సమయంలో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యలను అరికట్టాలంటే మెట్రో సిబ్బంది ప్రత్యేక గార్డులను ఏర్పాటు చేయడమే కాదు.. సాధారణ దుస్తుల్లో స్టేషన్లలో, రైల్వో బోగీల్లో పెట్రోలింగ్ చేయాలని సూచిస్తున్నారు. తద్వారా ఇలాంటి వెకిలి చేష్టలు చేసేవారికి కళ్లెం వేసినట్లు అవుతుందని అంటున్నారు. గతంలో ఈ తరహా సంఘటనలపై డీఎంఆర్సీ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అసభ్యకరమైన చేష్టకు పాల్పపడేవారికి చట్టం డీఎంఆర్సీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం సెక్షన్ 59 ప్రకారం నేరంగా పరిగణిస్తుందని స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి