iDreamPost

వరద బాధితులకు నయన్ సాయం.. విమర్శిస్తున్న నెటిజన్లు..!

మిచౌంగ్ తుఫాన్ ఎంతటి విపత్తును సృష్టించిందో అందరికీ తెలుసు. ఏపీ తీర ప్రాంతంతో పాటు తమిళనాడును వణికించేసింది. ఈ వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. రోడ్డు, రహదారులు, ఇళ్లల్లోకి నీళ్లు చేరిపోయాయి. ముంపు బాధితులను సహాయక కేంద్రాలకు తరలించింది ప్రభుత్వం. ఇదే సమయంలో వారికి సాయం అందించేందుకు కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చింది.

మిచౌంగ్ తుఫాన్ ఎంతటి విపత్తును సృష్టించిందో అందరికీ తెలుసు. ఏపీ తీర ప్రాంతంతో పాటు తమిళనాడును వణికించేసింది. ఈ వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. రోడ్డు, రహదారులు, ఇళ్లల్లోకి నీళ్లు చేరిపోయాయి. ముంపు బాధితులను సహాయక కేంద్రాలకు తరలించింది ప్రభుత్వం. ఇదే సమయంలో వారికి సాయం అందించేందుకు కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చింది.

వరద బాధితులకు నయన్ సాయం.. విమర్శిస్తున్న నెటిజన్లు..!

మిచౌంగ్ తుఫాన్ తమిళనాడుతో పాటు ఏపీ తీర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి విదితమే. అయితే ఈ తుఫాన్ కారణంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురియడంతో తమిళనాడు ముఖ్యంగా చెన్నై నగరం నీట మునిగింది. జన జీవనం అస్తవ్యస్థమైంది. రోడ్లు, రహదారులు జలమయ్యాయి. సుమారు ఎనిమిది మంది మరణించారు. ఈ తుఫాన్ ఏపీ కన్నా చెన్నై నగరాన్ని భీభత్సం చేసిందని చెప్పొచ్చు. అయితే తుఫాన్ తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడిప్పుడే చెన్న పట్టణం కోలుకుంటోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమయంలో మానవత్వం పరిమళిస్తుంది. పలువురు స్వచ్చందంగా బయటకు వచ్చి వరద బాధితులకు ఆహారం, దుస్తులు, మందులు, ఇతర సామాగ్రి అందజేస్తున్నారు.

అలాగే తమిళనాడు సినీ ఇండస్ట్రీకి కూడా ముందు కదిలింది. ఈ నేపథ్యంలో చాలా మంది వరద బాధితుల కోసం విరాళాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా తన వంతు సాయాన్ని అందించారు. ఇటీవల ఏర్పాటు చేసిన సౌందర్య ఉత్పత్తుల సంస్థ ‘ఫెమీ 9’ ఆధ్వర్యంలో చెన్నై వేలచ్చేరి కైవేలి బ్రిడ్జి సమీపంలోని ప్రాంతాల్లోని వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఫుడ్స్‌తో పాటు, వాటర్ బాటిల్స్, శానిటరీ న్యాప్ కిన్లు అందించారు. నయనతార చేసిన పనికి ప్రజలే కాదూ, నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం ఆమెపై గుర్రుగా ఉంది. కారణం.. ఆమె సేవను కూడా కమర్షియల్ చేసుకుందని అంటున్నారు.

అసలు ఏమైందంటే.. వరద బాధితులకు అందించిన ఫుడ్స్, వాటర్ బాటిల్స్‌ను తరలించేందుకు నయనతార కంపెనీకి చెందిన వాహనాలను వినియోగించారు. ఈ వాహనాలకు ఫెమీ 9 కంపెనీకి చెందిన బోర్డులు ఉండటమే నెటిజన్ల విమర్శలకు కారణమైంది. ఈ వీడియోను తన సంస్థ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు నయన్. వీడియో చివరిలో కొంత మంది మహిళలు.. ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్ని చూసిన కొందరు మెచ్చుకుంటుంటే. మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఆ మహిళలను బలవంత పెట్టి సీన్ చిత్రీకరించారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయాన్ని కూడా మీ బిజినెస్ కోసం వినియోగించుకుంటున్నారా..? మీ కంపెనినీ ప్రమోట్ చేస్తున్నారా.. అంటూప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ.. ఈ కష్టసమయంలో ఆమె చేపట్టిన సేవలను చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఆమె అభిమానులు, మహిళలు. నయన్ నిజంగా తన బిజినెస్ ప్రమోషన్ చేసుకుందని భావిస్తున్నారా.. అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by F E M I 9 (@femi9official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి