iDreamPost

ఓ యువకుడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది.. కానీ, ఒంటరిగా హొటల్ కు వెళ్లి..!

ఓ యువకుడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది.. కానీ, ఒంటరిగా హొటల్ కు వెళ్లి..!

ఈ యువతి పేరు అశ్న భీమ, వయసు 28 ఏళ్లు. గత కొంత కాలంగా ఆమె ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఈ యువతి స్థానికంగా ఉండే ఓ యువకుడితో లవ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్లు చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సమాచారం. కట్ చేస్తే.. ఈ యువతి ఈ నెల 7న ఒంటరిగా ఓ హోటల్ కు వెళ్లింది. అదే హోటల్ లో రెండు రోజుల పాటు బస చేసింది. అయితే, ఆ హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి ఆమె గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె ఎంతకు స్పందించలేదు. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఆ యువతి ఊహించని స్థితిలో కనిపించింది. ఆమెను అలా చూసి హోటల్ సిబ్బంది షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీ జంగాపూర్ పరిధిలోని పంత్ నగర్ లో అశ్న భీమ్ సీతి (28) అనే యువతి నివాసం ఉంటుంది. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ అమ్మాయి ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించారు. ఇదిలా ఉంటే.. ఈ యువతి స్థానికంగా ఉన్న ఓ యువకుడితో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. ఇదే విషయం ఇటీవల అశ్న తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయి కూతురుని మందలించారు. దీంతో ఆ అమ్మాయి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 7న అశ్న భీమ మయూర్ విహార్ లోని ఓ హోటల్ కు ఒంటరిగా వెళ్లింది. ఆ రోజంతా అదే హోటల్ లో బస చేసింది. ఇక మరుసటి రోజు కూడా ఉంటానంటూ హోటల్ సిబ్బందికి వెల్లడించింది.

కాగా, ఈ నెల 8న బస చేస్తున్న హోటల్ డబ్బులు తీసుకోవడానికి సిబ్బంది ఆ యువతి రూమ్ వద్దకు వెళ్లారు. ఎంత పిలిచినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఆ యువతి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సీన్ చూసిన ఆ సిబ్బంది ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక హోటల్ లో ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు ఏం జరిగిందంటూ మృతురాలి తల్లిదండ్రులను ప్రశ్నించగా.. మా కూతురు ఓ యువకుడితో ప్రేమలో ఉందని, వద్దని మేము నచ్చ చెప్పినా వినలేదని తెలిపారు. దీని కారణంగనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: రోజూ రాత్రిపూట భర్త టార్చర్! ఈ మహిళ ఇలా చేసిందేంటి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి