iDreamPost

ఆర్డర్ చేసిన వస్తువు.. నాలుగేళ్ల తరువాత డెలివరీ! ఏం జరిగిందంటే..

ఆర్డర్ చేసిన వస్తువు.. నాలుగేళ్ల తరువాత డెలివరీ! ఏం జరిగిందంటే..

ప్రస్తుతం అంతా సాంకేతిక యుగం నడుస్తుంది. దాదాపు అన్ని పనులు టెక్నాలజీ ద్వారానే జరుగుతున్నాయి.  చాలా మంది షాపిగ్ కూడా ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. అలానే ఏవైనా వస్తువులు  ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తుంటారు. అలా ఏదైన వస్తువును మనం ఆర్డర్ చేస్తే.. ఒకటి, రెండు రోజుల్లో ఇంటికి డెలివరీ అవుతోంది. మరీ దూరం  ఎక్కువ అయితే  ఓ వారం రోజులు పడుతుంది. ఇంకా ఏదైన ఇష్యూ ఉంటే ఒక నెల రోజులు వస్తువు ఇంటికి వస్తుంది. కానీ ఓ వ్యక్తికి తాను చేసిన ఆర్డర్‌ నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని తాజాగా ట్విటర్‌లో పంచుకున్నాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దిల్లీకి చెందిన నితిన్‌ అగర్వాల్‌  అనే వ్యక్తి  ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అతడు కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టారు. అందులో ఏం ట్వీట్ చేశారంటే.. చైనాకు చెందిన ఇ-కామర్స్‌ కంపెనీ ఆలీ ఎక్స్‌ప్రెస్‌ నుంచి కరోనా కంటే ముందే ఓ వస్తువును ఆర్డర్‌ చేశారు. అయితే ఎంతకాలం ఎదురు చూసిన ఆ వస్తువు డెలివరీ కాలేదు. చివరకు నితిన్ అగర్వాల్ దానిపై ఆశలు వదిలేసుకున్నారు. ఇక నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు తన వస్తువు డెలివరీ అయిందని నితిన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. అంతేకాక అసలు వస్తువు నాలుగేళ్ల తరువాత డెలివరీ కావడంతో  ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశాడు. ‘జీవితంలో ఎవరూ ఆశలు కోల్పోవద్దు.. ఎప్పుడో ఒకప్పుడు మీ వస్తువులూ డెలివరీ అవుతాయి’ అంటూ రాసుకొచ్చాడు.

ఇక ఇన్నేళ్ల ఆలస్యానికి కారణం ఏమిటంటే.. జాతీయ భద్రతను కారణంగా చూపుతూ 2020లో భారత ప్రభుత్వం ఆలీ ఎక్స్ ప్రెస్ కంపెనీను బ్యాన్ చేసింది. అయితే కేంద్రం దీన్ని నిషేధించకముందే ఈ వస్తువును నితిన్ అంగర్వాల్ కొనుగోలు చేశారంట. అయితే తాను  ఏ వస్తువును కొనుగోలు చేసిందని విషయాన్ని మాత్రం నితిన్ వెల్లడించలేదు. అతడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలానే ఈ పోస్ట్‌ పై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘2019 డిసెంబర్‌లో నేను రెండు వస్తువులను ఆర్డర్‌ పెట్టాను. మీ పోస్ట్‌ చూశాక ఎప్పటికైనా వస్తాయన్న నమ్మకం కుదిరింది’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ‘మీరు చాలా లక్కీ పర్సన్ సార్‌. 2017 నుంచి 19 మధ్యకాలంలో నేను చాలా ఆర్డర్‌ చేశాను. వాటి బిల్లులు కూడా ఉన్నాయి. ఆ వస్తువులు ఎప్పుడు డెలివరీ అవుతాయని ఎదురు చూస్తున్నా’ అంటూ మరో నెటిజన్  ట్వీట్‌ చేశాడు. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి