iDreamPost

ఢిల్లీలో మరో దారుణం.. విద్యార్థిని రాడ్డుతో కొట్టి చంపిన యువకుడు!

ఢిల్లీలో మరో దారుణం.. విద్యార్థిని రాడ్డుతో కొట్టి చంపిన యువకుడు!

గత కొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీలో వరుస హత్య ఘటనలు అక్కడి వారిని భయందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికీ ఢిల్లీలో ఎన్నో హత్య ఘటనలు వెలుగు చూశాయి. ఈ వరుస ఘటనలు మరువక ముందే తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు పార్క్ లో ఓ విద్యార్థినిని రాడ్డుతో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదే ఘటన ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఓప్రాంతంలో నర్గీస్ (25) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే, ఈ యువతి ఇర్ఫాన్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి ప్రేమాయణం చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల ఆ యువతి ఇంట్లో తెలిసింది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు అతడితో పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తుంది. దీని కారణంగా ఆ యువతి ప్రియుడితో మాట్లాడడం మానేసింది. ప్రియురాలు పట్టించుకోకపోవడంతో ఇర్ఫాన్ తట్టుకోలేకపోయాడు. ఇదే  విషయంపై గత కొన్ని రోజుల నుంచి గొడవ పడుతూనే ఉన్నారు. ఇకపోతే.. తాజాగా ఇద్దరు కలిసి మాలవీయానగర్ లో ఉన్న ఓ పార్కుకు వెళ్లారు. పెళ్లి విషయమై మరోసారి చర్చించుకున్నారు.

ఆ యువతి అతడితో పెళ్లికి నిరాకరించినట్లు సమాచారం. దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన ఇర్ఫాన్.. అక్కడున్న ఓ ఇనుప రాడ్డుతో ప్రియురాలి నర్గీస్ ను దారుణంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు పరారీలో ఉన్న నిందితుడు ఇర్ఫాన్ ను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఢిల్లీ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని కొట్టి చంపిన ప్రియుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: చెల్లి తల పగలకొట్టి చంపిన అన్న.. ఇప్పుడు వైరలవుతోన్న వీడియో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి