iDreamPost

IPLలో మ్యాక్స్ వెల్ ని మించిన ప్లాప్ షో ! ఈ కుర్రాడి ఒక్కో రన్ కి రూ.2.4 కోట్లు!

IPL చరిత్రలోనే అత్యంత కాస్ట్లీ ప్లేయర్ ఎవరంటే అందరూ మిచెల్ స్టార్క్ అనే చెబుతారు. కానీ అతడిని తలదన్నేలా ఒక్క రన్ కు రూ. 2.4 కోట్లు తీసుకున్నాడు 19 ఏళ్ల ఓ యంగ్ ప్లేయర్. ఆ వివరాల్లోకి వెళితే..

IPL చరిత్రలోనే అత్యంత కాస్ట్లీ ప్లేయర్ ఎవరంటే అందరూ మిచెల్ స్టార్క్ అనే చెబుతారు. కానీ అతడిని తలదన్నేలా ఒక్క రన్ కు రూ. 2.4 కోట్లు తీసుకున్నాడు 19 ఏళ్ల ఓ యంగ్ ప్లేయర్. ఆ వివరాల్లోకి వెళితే..

IPLలో మ్యాక్స్ వెల్ ని మించిన ప్లాప్ షో !  ఈ కుర్రాడి ఒక్కో రన్ కి రూ.2.4 కోట్లు!

ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.. సత్తా ఉన్న ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించడానికి కూడా వెనకాడట్లేదు ఫ్రాంచైజీలు. ఇక యంగ్ ప్లేయర్లు సైతం ఈ మెగా టోర్నీలో ఆడాలని కలలు కంటూ ఉంటారు. ఈ లీగ్ లో ఆడితే.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఫ్రాంచైజీలు కోట్లకు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటారు. దాంతో వారి డబ్బులు బూడిదలో పోసిన పన్నీరులా వ్యర్థం అవుతూ ఉంటాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో మాక్స్ వెల్ చేసిన మోసం కంటే.. పెద్ద మోసం చేశాడు ఓ యంగ్ ప్లేయర్. తాజాగా ముగిసిన ఐపీఎల్ లో సైతం ఆర్సీబీలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఓ 19 ఏళ్ల యంగ్ ప్లేయర్ పై కోట్లు కుమ్మరించి.. నిండా మునిగిపోయింది.

కుమార్ కుషాగ్ర.. ఐపీఎల్ చరిత్రలోనే కాస్ట్లీ ప్లేయర్. అదేంటి మిచెల్ స్టార్క్ కదా ఖరీదైన ఆటగాడు. అతడిని రూ. 24. 75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది కదా? అని మీకు అనుమానం రావొచ్చు నిజమే. కానీ ఇక్కడ ఆ ప్లేయర్ చేసిన పరుగులను, అతడిని కోనుగోలు చేసిన డబ్బులో భాగిస్తే.. స్టార్క్ కంటే కాస్ట్లీ ప్లేయర్ ఈ 19 ఏళ్ల కుమార్ కుషాగ్ర. ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ను ఐపీఎల్ వేలంలో రూ. 7.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

ఇక ఇతడు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు సార్లు బ్యాటింగ్ వచ్చింది. కానీ తనకు పెట్టిన ధరకు న్యాయం చేయలేకపోయాడు. 3 మ్యాచ్ ల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఒక్కో రన్ కు అతడికి రూ. 2.4 కోట్లు ఖర్చు చేసినట్లైంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విషయం తెలిసిన క్రికెట్ లవర్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కాస్ట్లీ ప్లేయర్ నువ్వేనయ్యా కుమార్ కుషాగ్ర అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అతడికి 3 మ్యాచ్ ల్లో మాత్రమే ఆడే అవకాశాం దక్కడంతో.. తన సత్తా నిరూపించుకోలేకపోయాడు అంటూ కొందరు అతడికి అండగా నిలుస్తున్నారు.

ఈ కుర్రాడిపై కోట్లు కుమ్మరించి నిండా ముగినింది ఢిల్లీ క్యాపిటల్స్ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. కాగా.. రిషబ్ పంత్ ప్రమాదం నుంచి కోలుకుని పూర్తి ఫిట్ నెస్ సాధించినప్పటికీ.. అతడిపై ఎక్కువ భారం పడకూడదని బ్యాకప్ వికెట్ కీపర్ గా కుషాగ్రను తీసుకున్నారు. కానీ జట్టులో పరిస్థితుల దృష్ట్యా అతడికి ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇదిలా ఉండగా.. ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ మాక్స్ వెల్ 10 మ్యాచ్ లు ఆడి దారుణంగా 52 రన్స్ మాత్రమే చేశాడు. ఇక అతడిపై ఆర్సీబీ అక్షరాల రూ. 14. 25 కోట్లు కుమ్మరించింది. దాంతో ఒక్కో రన్ కు మాక్సీకి రూ. 27 కోట్లు చెల్లించినట్లు లెక్కన్నమాట. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద నిరాశ అనుకుంటే.. అంతకంటే భారీగా నిరాశ పరిచాడు కుమార్ కుషాగ్ర. అతడికి ఒక్కో రన్ కు రూ. 2.4 కోట్లు చెల్లించింది ఢిల్లీ క్యాపిటల్స్. మరి కోట్లు కుమ్మరించిన ప్లేయర్ ఇలా ఫ్లాప్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి