iDreamPost

నరైన్ విషయంలో పంత్ ఘోర తప్పిదం.. ఇదేం కెప్టెన్సీ..?

DC vs KKR- Sunil Narine: వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ప్రతి బౌలర్ ని వీర బాదుడు బాదారు. ముఖ్యంగా సునీల్ నరైన్ విజృంభించాడు. కానీ, ఆ విజృంభణ వెనుక పంత్ మిస్టేక్ ఉంది.

DC vs KKR- Sunil Narine: వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ప్రతి బౌలర్ ని వీర బాదుడు బాదారు. ముఖ్యంగా సునీల్ నరైన్ విజృంభించాడు. కానీ, ఆ విజృంభణ వెనుక పంత్ మిస్టేక్ ఉంది.

నరైన్ విషయంలో పంత్ ఘోర తప్పిదం.. ఇదేం కెప్టెన్సీ..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 అసలైన పొట్టి క్రికెట్ మజాని అందిస్తోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగడమే కాకుండా మైదానంలో పరుగుల వరద పారుతోంది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్ ఎవరైనా బంతిని బౌండరీకి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బౌలర్ ఎవరైనా విచక్షణారహితంగా దండిస్తున్నాడు. ఇషాంత్ శర్మాలాంటి సీనియర్ ఓవర్లోనే 26 పరుగులు రాబట్టాడు. ఇంక కుర్రాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే నరైన్ ఇంతలా చెలరేగడానికి కారణం పంత్ అనే చెప్పాలి. కెప్టెన్ గా పంత్ చేసిన ఆ తప్పు వల్ల ఇప్పుడు మూల్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం చెల్లిస్తోంది.

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ కి కోల్ కతా నైట్ రైడర్స్ భయాన్ని ప్రత్యక్షంగా చూపించింది. ముఖ్యంగా సునీల్ నరైన్ విజృంభించాడు. ఢిల్లీ బౌలర్స్ నరైన్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. వచ్చేది ఏ బౌలర్ అయినా కూడా సిక్సులు, ఫోర్లతో వీరబాదుడు బాదాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు. సునీల్ నరైన్ ఊచకోతకు బలైన బౌలర్స్ లో ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో నరైన్ ఒక్క ఓవర్లోనే 6, 6, 4, 0, 6, 4 బౌండిరీలతో ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. మధ్యలో ఉన్న ఒక్క డాట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫేట్ ని మార్చేసింది. 24 పరుగుల వద్ద సునీల్ నరైన్ అవుటయ్యాడు. కానీ, పంత్ చేసిన పనికి అతను ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.

ఆ డాట్ బాల్ దగ్గర సునీల్ నరైన్ బ్యాటుకు బంతి తాకింది. దానిని పంత్ పట్టుకున్నాడు. ఆ సమయంలో ఇషాంత్ శర్మ గానీ.. పంత్ గానీ రివ్యూకి వెళ్లలేదు. గ్రౌండ్ లో మరొకరు అవుట్ అని కేకలు వేయగా.. పంత్ చాలాసేపు ఆలోచించి అనుమానాస్పదంగా అంపైర్ కి చేతులు చూపించాడు. కానీ, అప్పటికే డీఆర్ఎస్ రిక్వెస్ట్ టైమ్ అయిపోయింది. అంపైర్ కూడా లేట్ కాల్ అంటూ కామెంట్ చేశాడు. అప్పటికి అది అవుటో నాటౌటో చూపించలేదు. కానీ, కాసేపటికి అది అవుట్ గా తేలింది. చాలా చిన్న స్పైక్ అల్ట్రా ఎడ్జ్ లో కనిపించింది. ఆ అవకాశాన్ని పంత్ చేతులారా చేజార్చుకున్నాడు.

పంత్ ఒక కెప్టెన్ గా కాన్ఫిడెంట్ ఒక నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆ మూల్యాన్ని ఢిల్లీ జట్టు చెల్లించాల్సి వచ్చింది. నరైన్ తో పాటు రఘువన్షీ కూడా వీహారం చేశాడు. ఈ జోడీ విజృంభించడంతో కేకేఆర్ జట్టు కేవలం 12 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ కేవలం 39 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. 7 సిక్సులు, 7 ఫోర్లతో బౌలర్లని పనిష్ చేశాడు. నరైన్ వికెట్ పడగానే ఢిల్లీ జట్టు ఊపిరిపీల్చుకుంది. మిచెల్ మార్ష్ కోల్ కతా విధ్వాంసానికి తాత్కాలికంగా బ్రేక్ వేశాడు. మరి.. సునీల్ నరైన్ విషయంలో పంత్ తీసుకున్న లేట్ కాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి