iDreamPost
android-app
ios-app

Shubman Gill: వీడియో: లేడీ ఫ్యాన్ అందానికి గిల్ ఫిదా! ఏం చేశాడో మీరే చూడండి..

  • Published Apr 18, 2024 | 12:04 PM Updated Updated Apr 18, 2024 | 12:04 PM

తాజాగా జరిగిన గుజరాత్-ఢిల్లీ మ్యాచ్ లో ఓ లేడీ ఫ్యాన్ అందానికి ఫిదా అయిన శుబ్ మన్ గిల్ ఇచ్చిన రియాక్షన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.

తాజాగా జరిగిన గుజరాత్-ఢిల్లీ మ్యాచ్ లో ఓ లేడీ ఫ్యాన్ అందానికి ఫిదా అయిన శుబ్ మన్ గిల్ ఇచ్చిన రియాక్షన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.

Shubman Gill: వీడియో: లేడీ ఫ్యాన్ అందానికి గిల్ ఫిదా! ఏం చేశాడో మీరే చూడండి..

అసలే ఐపీఎల్ ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు దుమ్మురేపుతూ ఉంటారు. ఇక వారి ఆటను ఆస్వాదిస్తూ.. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు చప్పట్లు, ఈలలు, అరుపులతో గ్రౌండ్ దద్దరిల్లేలా అరుస్తూ ఉంటారు. ఇదే క్రమంలో కెమెరామెన్ ఒక వైపు మ్యాచ్ ను చూపిస్తూనే మరోవైపు అందమైన అమ్మాయిలను బిగ్ స్క్రీన్ పై చూపిస్తూ మ్యాచ్ కు మరింత అందాన్ని తీసుకొస్తాడు. అయితే అలా బ్యూటీఫుల్ లేడీ ఫ్యాన్స్ ను చూపిస్తున్నప్పుడు కొంత మంది క్రికెటర్లు ఇచ్చే రియాక్షన్స్ ను సైతం కెమెరామెన్ క్యాప్చర్ చేస్తుంటాడు. ఇక అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా జరిగిన గుజరాత్-ఢిల్లీ మ్యాచ్ లో కూడా ఓ లేడీ ఫ్యాన్ అందానికి ఫిదా అయిన శుబ్ మన్ గిల్ ఏం చేశాడంటే?

టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ ఈ ఐపీఎల్ తో మంచి టచ్ లోకి వచ్చాడు. బ్యాటింగ్ లో రాణిస్తున్న గిల్.. కెప్టెన్ గా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్ లో ఆరంభంలో మంచి విజయాలతో అదరగొట్టిన గుజరాత్.. రానురాను తమ ఫామ్ ను కోల్పోతోంది. దీంతో ఓటములు జట్టును కుంగదీస్తున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ కేవలం 89 పరుగులు మాత్రమే చేసి.. ప్రత్యర్థికి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అప్పగించింది. బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో.. గుజరాత్ కు ఓటమి తప్పలేదు.

ఇక ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే? ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. కెమెరామెన్ ఓ అందమైన అమ్మాయిపై తన లెన్స్ ను ఫొకస్ చేశాడు. దీంతో బిగ్ స్క్రీన్ పై ఆ బ్యూటీ చప్పట్లు కొడుతూ.. తళుక్కున మెరిసింది. దీంతో ఆ అమ్మాయిని చూసి ఫిదా అయినట్లున్నాడు గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్. ఆమెను అలానే చూస్తూ.. వాటే బ్యూటీ అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కెమెరామెన్ పనితాన్ని పొగుడుతూనే.. గిల్, ఈ వీడియో సారాతో పాటుగా ఇండియా మెుత్తం చూస్తోంది అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం.. ఆమె పృథ్వీ షా లవర్ భయ్యా.. ఎందుకు అలా చూస్తున్నావ్, నువ్వు మామూలోడివి కాదు గిల్ బ్రో అంటూ మరికొందరు రాసుకొచ్చారు. ముందు మ్యాచ్ గెలువు బ్రో ఇవ్వన్నీ తర్వాత సంగతి అని ఇంకొందరు చురకలు అంటించారు. మరి ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet