iDreamPost

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్‌

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ సర్కార్‌ అన్నదాతల కోసం మరో పథకం అమలుకు సిద్ధమవుతోంది. ఈ ఖరీఫ్‌ నుంచి రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు.

క్రాఫ్‌లోన్లు తీసుకునే ప్రతి రైతులకు సున్నా వడ్దీ పథకం వర్తించనుంది. ఈ పథకంతోపాటు రాబోవు జూలై నెల నుంచి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకు అవసరమైన ఫీడర్ల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందన్నారు.

Read Also: సీఎం కు రాజధాని రైతుల కృతజ్ఞతలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ పథకం ప్రారంభించారు. 2004 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా ఆ పథకాన్ని కొనసాగించారు. వైఎస్సార్‌ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం.. పలు పథకాల పేర్లు మార్చి వాటిని నిర్వీర్యం చేసినా.. ఉచిత విద్యుత్‌ పథకం జోలికి మాత్రం రాకపోవడం ఆ పథకం రైతులకు ఏ స్థాయిలో మేలు చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పథకాన్ని మరింత సమర్థవంతగా అమలు చేసేందుకు అధికారంలోకి వచ్చినప్పుటి నుంచీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా పగటి పూటనే వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్‌ ఇచ్చేందుకు అవసరమైన ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి