ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో నిర్ణాయకంగా మారిన చివరిదైన ఐదో టెస్టు మరో కీలక మలుపు తీసుకుంది. గెలుపు ఇంగ్లాండ్‌ను దాటి.. ఆస్ట్రేలియా ఖాతాలో పడేలా కనిపిస్తోంది. 384 రన్స్ ఛేదనలో ఆదివారం వర్షం కారణంగా ఆట ముగిసే సరికి ఆసీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 135 రన్స్ చేయడం విశేషం. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (58 బ్యాటింగ్), ఉస్మాన్ ఖవాజా (69 బ్యాటింగ్) పట్టుదలతో క్రీజులో నిలబడ్డారు. కంగారూ జట్టు నెగ్గాలంటే ఆఖరి రోజు మరో 249 రన్స్ చేయాలి. అదే ఇంగ్లీష్ టీమ్ గెలవాలంటే 10 వికెట్లు పడగొట్టాలి.
ఓవర్‌నైట్ స్కోరు 389/9తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. మరో ఆరు పరుగులు జోడించి 395 రన్స్‌కు ఆలౌటైంది. కెరీర్లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న బ్రాడ్.. అండర్సన్‌తో కలసి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇచ్చారు. ఇంగ్లండ్ ఆలౌటైన తర్వాత ఆసీస్ భారీ టార్గెట్‌ను ఛేజ్ చేయడం మొదలెట్టింది. అయితే వాన వల్ల కంగారూ జట్టు 38 ఓవర్లే బ్యాటింగ్ చేయగలిగింది. త్వరత్వరగా ఆసీస్ వికెట్లు పడగొట్టి.. గెలుపు బాటలు వేసుకుందామని చూసిన ఇంగ్లండ్‌కు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఎదురు నిలిచారు.
ఇంగ్లండ్ బౌలర్లకు మరో ఛాన్స్ ఇవ్వకుండా వార్నర్, ఖవాజా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో వార్నర్ ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సార్లు (25) 100 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఖవాజాతో కలసి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో ఈ అరుదైన రికార్డును అతడు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో జాక్ హబ్స్, గ్రేమ్ స్మిత్, అలిస్టర్ కుక్ (24) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డులను అధిగమించాడు. ఈ లిస్టులో మైకేల్ అథర్టన్ (23), టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (23) మూడో ప్లేసులో ఉన్నారు.
Fifty by David Warner!
A superb half century by Warner in the big run chase, Australia have started the run chase on a bang. Fantastic from Warner and Khawaja. pic.twitter.com/uqmFTLboNP
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 30, 2023