iDreamPost

మరోసారి హైదరాబాద్ పై ప్రేమను చాటుకున్న వార్నర్! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 04:15 PM, Thu - 10 August 23
  • Author Soma Sekhar Published - 04:15 PM, Thu - 10 August 23
మరోసారి హైదరాబాద్ పై ప్రేమను చాటుకున్న వార్నర్! పోస్ట్ వైరల్..

సాధారణంగా క్రికెటర్లు షెడ్యూల్స్ లో భాగంగా టోర్నీలు ఆడటం కోసం వివిధ దేశాలకు వెళ్తూ ఉంటారు. దీంతో వారికి ఆ దేశాలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అయితే కొందరు ఆటగాళ్లకు కొన్ని ప్రదేశాలు అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమే ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు హైదరాబాద్ పై ఉంది. భాగ్యనగరంపై వార్నర్ కు అమితమైన ప్రేమ ఉందని మరోసారి తెలియజేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ప్రాతినిథ్యం వహించినప్పటి నుంచి వార్నర్ భాయ్ కి ఈ మహానగరంతో మంచి బాండింగ్ ఏర్పడింది. తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఫన్నీ రిప్లై ఇచ్చాడు డేవిడ్ భాయ్.

డేవిడ్ వార్నర్.. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా, వరల్డ్ క్లాస్ స్టార్ క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా పూర్ ఫామ్ తో సతమతమవుతూ ఉన్నాడు. ఇక హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం కలిగిఉన్నాడు వార్నర్. ఐపీఎల్ పుణ్యమాని తెలుగు క్రికెట్ అభిమానులకు వార్నర్ కు మంచి బాండింగ్ ఏర్పడింది. అదీకాక తెలుగు పాటలకు డబ్ స్మాష్ లు చేస్తూ.. అభిమానులకు మరింత చేరువైయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన టైమ్ లో భాగ్యనగరంతో పాటుగా తెలుగు ప్రేక్షకులకు ఫిదా అయ్యాడు వార్నర్ భాయ్.

ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ ను ఓ అభిమాని ఓ ప్రశ్న అడిగాడు. చివరి సారిగా మీరు హైదరాబాద్ లో చూసిన ప్లేస్ ఏంటి? దాని ఫొటో పెట్టండి అంటూ అడిగాడు. దానికి వార్నర్ భాయ్ చార్మినార్ పిక్ పెట్టాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? వార్నర్ కు చార్మినార్ పేరు కూడా తెలియకపోవడం. ఇది నేను తీసిన పిక్ కాదు.. ఈ ప్లేస్ ను నేను చూశాను. దీనికి పేరు పెట్టండి అంటూ రాసుకొచ్చాడు వార్నర్. కాగా.. మరోసారి వార్నర్ తనకు భాగ్యనగరం అంటే ఎంత ప్రేమో తెలియజేశాడు.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)


ఇదికూడా చదవండి: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. చరిత్రలో తొలిసారి ఇలా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి