iDreamPost

పవిత్ర గౌడ లైఫ్ స్టోరీ! కిరాణా షాపు నుంచి కోటీశ్వరురాలి దాకా..

కన్నడ చిత్ర సీమలో దిగ్బ్రాంతికి గురి చేసిన ఘటన.. దర్శన్ అరెస్టు. సొంత అభిమానిని హత్య చేసిన కేసులో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అందుకు కారణం ప్రియురాలు పవిత్ర గౌడ. ఓ సామాన్యురాలు.. దర్శన్ కు ప్రియురాలు ఎలా అయ్యింది.. ? కోటీశ్వరురాలిగా ఎలా ఎదిగింది అంటే..?

కన్నడ చిత్ర సీమలో దిగ్బ్రాంతికి గురి చేసిన ఘటన.. దర్శన్ అరెస్టు. సొంత అభిమానిని హత్య చేసిన కేసులో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అందుకు కారణం ప్రియురాలు పవిత్ర గౌడ. ఓ సామాన్యురాలు.. దర్శన్ కు ప్రియురాలు ఎలా అయ్యింది.. ? కోటీశ్వరురాలిగా ఎలా ఎదిగింది అంటే..?

పవిత్ర గౌడ లైఫ్ స్టోరీ! కిరాణా షాపు నుంచి కోటీశ్వరురాలి దాకా..

కన్నడ చిత్ర పరిశ్రమను మాత్రమే కాకుండా దక్షిణాది ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన శాండిల్ వుడ్ టాప్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్. ఈ పరిణామం ఒక్కసారి చందన సీమను కలవరపాటుకు గురిచేయడంతో పాటు ఉలిక్కి పడేలా చేసింది.తన స్వంత అభిమానినే హత్య చేశాడు ఈ స్టార్ నటుడు. దానికి కారణం ప్రియురాలు పవిత్ర గౌడ. ఆమెకు రేణుకాస్వామి అనే వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపిస్తున్నాడన్న కారణంతో దర్శన్ కొంత మంది అభిమానులతో కలిసి.. అతడ్ని కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా చిత్రవధ చేసి, కొట్టి చంపడంతో చనిపోయాడు. అనంతరం రేణుకా స్వామిని ఓ కాల్వలో పడేశారు. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. దర్శన్ పేరు వినిపించింది.

దర్శన్ అరెస్టు చేసిన వెంటనే.. ఈ హత్యలో కీలకమైన వ్యక్తిగా భావించి పవిత్ర గౌడను కూడా అదుపులోకి తీసుకున్నారు. రేణుకా స్వామి పోస్లుమార్టం రిపోర్టులో అత్యంత దారుణంగా అతడ్ని హత్య చేసినట్లు తేలింది. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల కష్టడీలో ఉన్న సంగతి విదితమే. ఈ మొత్తం హత్యలో కీలకంగా మారింది పవిత్ర గౌడ. ఇంతకు పవిత్ర ఎవరు.. అత్యంత సామాన్యురాలు.. ఎలా కోటీశ్వరురాలు అయ్యింది. భర్తను వదిలి.. దర్శన్‌ను ఎలా కలిసింది. ఆ వివరాల్లోకి వెళితే..పవిత్ర గౌడ బెంగళూరులోని జేపీ నగర్‌కు చెందిన అమ్మాయి. ఆమె తండ్రికి చిన్న కిరాణ కొట్టు ఉండేది. బిషప్ కాటన్ కాలేజీలో బీసీఏ డిగ్రీ పూర్తి చేసి సిస్టమ్ డిజైనింగ్‌లో డిగ్రీ అందుకుంది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. పవిత్ర గౌడ పలు జ్యువెలరీ స్టోర్స్‌కు సంబంధించిన పలు ప్రకటనల్లో కనిపించింది. ఆమె ఒకప్పటి మిస్ బెంగళూరు కూడా.

బుల్లి తెర నుండి తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. రెండు, మూడు సినిమాలు చేసింది. పవిత్ర.. సంజయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఖుషీ అనే పాప కూడా ఉంది. భర్తతో విబేధాల కారణంగా దూరంగా ఉంటుంది. ఇటు కెరీర్ పై దృష్టి పెట్టింది. దర్శన్ నటిస్తున్న జగ్గుదాదా మూవీ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ సమయంలో పవిత్ర గౌడ ఆడిషన్‌కు వెళ్లింది. అలా వారిద్దిరికీ పరిచయం ఏర్పడి..ప్రేమకు దారి తీసింది. దర్శన్‌తో ప్రేమ, రిలేషన్ షిప్ ఆమెను కోటీశ్వరురాలిని చేసింది. అక్కడ నుండి పవిత్ర 2.0 స్టార్ట్ అయ్యింది. పవిత్ర గౌడకు ఆర్ఆర్ నగర్‌లోని మూడంతస్తుల ఇంటిని కూడా దర్శన్ బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. అలాగే తన భార్య విజయలక్ష్మీకి అత్యంత ఖరీదైన కారును దర్శన్ గిఫ్టుగా ఇవ్వగా.. అలాంటి కారే తనకు కావాలని.. పంతం పట్టి మరీ అతడితో కొనిపించుకుందని అంటుంటారు. ఇలా అత్యంత సామాన్యురాలు పవిత్ర.. కోట్లకు అధిపతి అయ్యింది. బెంగళూరులో రెడ్ కార్పెట్ స్టూడియో 777 అనే ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి