iDreamPost

సంబరం మూవీ హీరోయిన్.. ఆ కాంట్రవర్సీ హీరోకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

ప్రముఖ దర్శకుడు దశరథ్ తెరకెక్కించిన మూవీల్లో ఒకటి సంబరం. నితిన్ హీరో కాగా, నికిత హీరోయిన్. కాగా, ఆమె గతంలో ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ రోజు వార్తల్లో నిలిచిన ఆ వ్యక్తితో రిలేషన్ మెయిన్ టైన్ చేసిందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. మరీ ఆ బ్యూటీ ఇప్పుడు ఏం చేస్తుంటందంట..?

ప్రముఖ దర్శకుడు దశరథ్ తెరకెక్కించిన మూవీల్లో ఒకటి సంబరం. నితిన్ హీరో కాగా, నికిత హీరోయిన్. కాగా, ఆమె గతంలో ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ రోజు వార్తల్లో నిలిచిన ఆ వ్యక్తితో రిలేషన్ మెయిన్ టైన్ చేసిందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. మరీ ఆ బ్యూటీ ఇప్పుడు ఏం చేస్తుంటందంట..?

సంబరం మూవీ హీరోయిన్.. ఆ కాంట్రవర్సీ హీరోకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?

నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు.. హీరోయిన్లుగా మారి..ఫటా ఫట్ .. ధనా ధన్ అంటూ సినిమాలు చేసుకుంటూ పోతుంటారు. వరుస ఆఫర్లతో స్టార్ డమ్ చూస్తుంటారు. దేవ కన్యలా అలా వచ్చి.. ఇలా మెరిసి, మెస్మరైజ్.. ఆ తర్వాత కనిపించకుండా పోతుంటారు. ఆ బ్యూటీల్లో ఈమె కూడా ఒకరు. ముంబయి నుండి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇక్కడ ఓ వెలుగు వెలిగి.. ఆ సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని చుట్టేసింది. కన్నడ ఇండస్ట్రీలో మక్కువతో అక్కడే పాగా వేసేందుకు ప్రయత్నించింది. మెల్లిగా తెలుగు సినిమాలకు దూరం అయ్యింది. ఆ సమయంలో ఓస్టార్ హీరోతో రొమాన్స్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె తెరమరుగైంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.?

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దశరథ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన మూవీనే సంబరం. 2003లో వచ్చిన ఈ సినిమా ఓకే అనిపించుకుంది. జయం, దిల్ వరుస హిట్లతో జోష్‌లో ఉన్న యంగ్ హీరో నితిన్ నుండి వచ్చిన మూడవ చిత్రం ఇది. ఇందులో హీరోయిన్‌గా నటించింది ముంబయి బ్యూటీ. ఆమె ఎవరంటే నికిత తుక్రాల్. పంజాబీ గుడియా అయిన ఆమె.. ముంబయిలో పెరిగింది. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.. తన కుమారుడు ఆర్యన్ రాజేశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ హాయ్ అని మూవీని తెరకెక్కించాడు. ఆ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసింది నికిత. ఆ తర్వాత మలయాళ, తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో కళ్యాణ రాముడుతో హిట్ అందుకుంది.

టాలీవుడ్‌లో ఆమె చేసిన మూడవ మూవీ సంబరం… దక్షిణాది ఇండస్ట్రీలో పేర్లర్‌గా వర్క్ చేసుకుంటూ వచ్చింది. తెలుగులో ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, అగంతకుడు, మహారాజశ్రీ, నీ నవ్వే చాలు, అనసూయ, భద్రాద్రితో పాటు అవును 2, టెర్రర్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే చింతకాయల రవిలో పూజ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసింది. అయితే ఆమె కన్నడలో దర్శన్ సరసన యోధ, ప్రిన్స్ వంటి చిత్రాలు చేసింది. ఆ సమయంలో వీరిద్దరికి మధ్య బంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ రిలేషన్స్‌లో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి. ఆ సమయంలోనే దర్శన్ భార్య విజయలక్ష్మీ … తనను వేధిస్తున్నాడంటూ గృహ హింస కేసు పెట్టింది. దీనికి కారణం నికిత అని అప్పట్లో ఆమెను మూడేళ్ల పాటు నిషేధాన్ని విధించి.. ఆపై వెనక్కు తీసుకుంది కన్నడ ఇండస్ట్రీ. ఆ తర్వాత ఏడేళ్ల పాటు దక్షిణాది ఇండస్ట్రీలో సినిమాలు చేసి 2018 తర్వాత తెరమరుగైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి