iDreamPost

శివాజీ అసలు రంగు బయటపెట్టిన ధామినీ.. కన్నింగ్ గేమ్ అంటూ..!

శివాజీ అసలు రంగు బయటపెట్టిన ధామినీ.. కన్నింగ్ గేమ్ అంటూ..!

బిగ్గెస్ట్ రియాలిటీ షో అనగానే.. అందరూ టక్కున బిగ్ బాస్ అనే చెప్తారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. హౌస్ లో ఇప్పటికే మూడు వారాలు పూర్తయ్యాయి. ఈ సీజన్ ఉల్టా పుల్టా కావడంతో.. ఆట కొనసాగే కొద్దీ మరిన్ని ట్విస్టులు, షాకులు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. తాజాగా మూడోవారం ధామినీ ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. స్టేజ్ మీద ఉన్నప్పుడు, బయటకు వచ్చిన తర్వాత ధామినీ శివాజీ విషయంలో కొన్ని కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ఎక్కువ రోజులు మాస్కు వేసుకుని ఆడలేరు. ఈ విషయాన్ని వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా స్పష్టం చేశారు. మూడు, నాలుగు వారాల్లో అన్నీ మాస్కులు పోతాయి అని. అయితే హౌస్ లో మాస్కు వేసుకుని ఆడుతున్న వాళ్లు ఎవరు అంటే.. రతికా, పల్లవి ప్రశాంత్, శివాజీ పేర్లు వినిపిస్తాయి. వీళ్లకి సంబంధించి హౌస్ లో కంటెస్టెంట్స్ కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూనే ఉన్నారు. అయితే ప్రశాంత్, రతికా విషయం పక్కన పెడితే.. శివాజీ పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. శివాజీ ఇంకా మాస్కు వేసుకునే ఆడుతున్నాడు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం దొరికిపోయి కంటెస్టెంట్స్ కి సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి కూడా వస్తోంది. సీజన్ స్టార్టింగ్ లో ప్రశాంత్ తో మంచిగా ఉంటూనే.. అమర్ దీప్- సందీప్ వాళ్లతో ప్రశాంత్ తో పోటీ పడండి అని చెప్పడం చూశాం.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్-7లోకి అగ్గిపెట్టె మచ్చా? వైల్డ్ కార్డు ఎంట్రీలో ట్విస్ట్!

తాజాగా అన్న అన్న అని వెనక తిరిగే రతికాతో కూడా శివాజీకి చెడింది. ప్రశాంత్ విషయంలో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్పడం రతికా తీసుకోలేకపోయంది. నిజానికి ఇద్దరూ క్లోజ్ అయినప్పుడు తప్పుగా అనిపించినా.. తప్పుగా అర్థమవుతుంది అనుకున్న శివాజీ ముందే చెప్పి ఉండాల్సింది. కానీ, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది. అలాగే తాజాగా ఎలిమినేట్ అయిన ధామినీ కూడా శివాజీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. హౌస్ లో ఉన్నప్పుడు కూడా ధామినీ.. శివాజీ విషయంలో అంత పాజిటివ్ గా లేదు. ఆయన ఏదో మాస్కు వేసుకు ఆడుతున్నట్లు అనిపిస్తోంది. అని చెప్పింది. ఆయన ఆట చూస్తే అదే నిజం అనిపించకమానదు. ఎందుకంటే పవరాస్త్రం పోయింది అని హౌస్ మొత్తం గోల గోల చేసిన శివాజీ.. తీరా అది తీసుకు వచ్చిన అమర్ దీప్ ని ఒక్క మాట అనలేదు. ఏ పాపం తెలియని టేస్టీ తేజని కుక్క తోక వంకర అంటూ కామెంట్ చేశాడు. అలాగే ఆట విషయంలో కూడా తనకి అంతా తెలుసు అన్నట్లు కాస్త ఎక్కువగా థింక్ చేస్తున్నాడు.

తాజాగా ధామినీ స్టేజ్ మీద నుంచి చేసిన కామెంట్స్ చూస్తే.. “నేను ఏవీలో చూశాను.. మీరు నావైపు వేలు చూపిస్తూ సేఫ్ గేమ్ ఆడుతోంది అంటూ కామెంట్ చేశారు. నేను సేఫ్ గేమ్ ఆడను” అంటూ క్లారిటీ ఇచ్చింది. అందుకు శివాజీ మాట్లాడుతూ.. “నేను అలా అనలేదమ్మా.. బహుశా నీ ఆట నువ్వు ఆడలేదు అని ఉంటాను. ఒకవేళ అలా అని ఉంటే తప్పకుండా క్షమాపణ అడుగుతాను” అని చెప్పుకొచ్చాడు. నిజానికి ఆమె అప్పుడే ఏవీలో చూసి అడుగుతున్నట్లు చెప్పింది. కానీ, నేను అలా అనలేదు అన్నట్లు శివాజీ జవాబు చెప్పాడు. అంతేకాకుండా బిగ్ బాస్ బజ్ లో కూడా ధామినీ శివాజీ గేమ్ గురించి కామెంట్స్ చేసింది. శివాజీది హౌస్ లో చాలా చాలా కన్నింగ్ గేమ్ అంటూ చెప్పుకొచ్చింది. గతంలో అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ధామినీ చెప్పిన విషయాలు చూస్తే.. శివాజీ మాస్కు వేసుకుని గేమ్ ఆడుతున్నాడు అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరి.. శివాజీ ఎన్నాళ్లు మాస్కు వేసుకుని ఆడతారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.